గతంలో కాఫీ విత్ సుచీ అనే షో ద్వారా పాపులర్ అయిన ప్రముఖ సింగర్ సుచిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె సింగర్‌గా తెలుగు, మలయాళ భాషల్లో ఎన్నో వందల పాటలను పాడారు.. అంతేకాదు తమిళ్లో కొన్ని సినిమాల్లో కూడా నటించింది. సుచీలీక్స్‌తో సింగర్ సుచిత్ర అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సెలబ్రిటీల పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఇండస్ట్రీలో పెద్ద తుఫాన్ ను సృష్టించింది.. తాజాగా మరోసారి సంచలనంగా మారింది.. ప్రస్తుతం ఈమె వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె హీరో ధనుష్ తో పాటు, తన మాజీ భర్త పై సంచలన ఆరోపణలు చేసింది.. ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ గురించి మాట్లాడుతూ.. వాళ్లు పెళ్లయినప్పటినుంచి ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూనే ఉన్నారు. పెళ్లయిన విషయాన్నే మర్చిపోయి మిగతావాళ్లతో డేటింగ్ చేశారు.. అంటూ రెచ్చిపోయింది.. ధనుష్ ఓ గే.. అర్దరాత్రి వరకు మగవాళ్లతో పార్టీలు చేసుకొంటారు.. అంతేకాదు తన భర్త కూడా ఒక గే అని బాంబు పేల్చింది..
తాజాగా ఈ విషయం పై ఆమె భర్త నటుడు కార్తిక్ కుమార్ స్పందించారు..ఈ వ్యాఖ్యలపై నటుడు కార్తీక్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.. ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. నేను స్వలింగసంపర్కుడినా? ఒకవేళ అదే అయ్యుంటే మాత్రం బయటకు చెప్పడానికి నేనేమీ సిగ్గుపడేవాడిని కాదు. అది ఏదైనా సరే గర్వంగా చెప్పుకునేవాడిని. అంతేకానీ ముడుచుకుపోను.. అందరికీ ఆదర్శంగా ఉండేవాడిని అంటూ ఫైర్ అయ్యాడు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..