NTV Telugu Site icon

Priyank Kharge : శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. ఆర్‌ఎస్‌ఎస్‌ అయినా సరే.. బ్యాన్‌ చేస్తాం : మంత్రి ప్రియాంక్‌ ఖర్గే

Priyank Kharge

Priyank Kharge

Priyank Kharge : రాష్ట్రంలో మత సామరస్యానికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌తో సహా ఏ సంస్థనైనా నిషేధించేందుకు వెనుకాడబోమని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే ఈ ఎన్నికల్లో చిత్తాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.శాంతికి విఘాతం కలిగించడానికి, మత విద్వేషాలను వ్యాప్తి చేయడానికి, కర్ణాటక పరువు తీయడానికి ఏదైనా మతపరమైన లేదా రాజకీయ సంస్థ ప్రయత్నిస్తే, వారితో చట్టబద్ధంగా వ్యవహరించడానికి లేదా నిషేధించడానికి సిద్ధరామయ్య ప్రభుత్వం వెనుకాడదని ప్రియాంక్ ఖర్గే ట్విట్టర్‌లో తెలిపారు. అప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) లేదా మరే ఇతర సంస్థ అయినా సరే నిషేధిస్తామన్నారు.

Read Also:New Parliament: కొత్త పార్లమెంట్‌ ఓపెనింగ్‌.. వాళ్లు రాకపోయినా మేము వస్తాం..

కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హిందుత్వ సంస్థ బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ఈ ప్రకటన తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కూడా కాంగ్రెస్‌ వాగ్దానాలపై విమర్శలు గుప్పించాయి. బజరంగ్‌దళ్‌పై నిషేధం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మొదట రాముడిని నిషేధించిందని, ఇప్పుడు జై బజరంగ్ బలి అని నినాదాలు చేసేవారిని నిషేధిస్తామని బెదిరిస్తోందని అన్నారు. ప్రధాని దీనిని దేశ దురదృష్టంగా అభివర్ణించారు. కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు గానూ 135 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాష్ట్రానికి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కాగా, డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం అయ్యారు.

Read Also:CM KCR: నేడు సచివాలయంలో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష.. పాల్గొననున్న కలెక్టర్లు, ఎస్పీ, సీపీలు

Show comments