Kunki Elephants: దసరా తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మావోలతో సహా నాలుగు కుంకీ ఏనుగులను పంపడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు కర్ణాటక మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రే.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆరు కీలకమైన ఒప్పందాలు జరిగాయి.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కల్యాణ్‌తో కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖల మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రే సమావేశం అయ్యారు.. ఈ భేటీలో రెండు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. అనంతరం మీడియాతో ఈశ్వర్ బి. ఖండ్రే.. ఈ ఎంఓయూ కి సహకరించిన ఇరు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు..
Read Also: Casting Couch: ఒక సినిమా కోసం ఐదుగురు నిర్మాతలు పడుకోమన్నారు.. హీరోయిన్ సంచలనం
ఇక, ఎంఓయూ ద్వారా స్మగ్లింగ్ ను అరికట్టడానికి ఉపయోగపడుతుందన్నారు ఈశ్వర్.. ఏనుగుల దాడి అంశంలో కుంకీ ఏనుగులు బాగా ప్రావీణ్యం కలిగిన మావటీలతో అందిస్తామని వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్‌లో కర్ణాటక మావటీలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.. మా దగ్గర ఉన్న ఫారెస్ట్ గవర్నెన్స్ ట్రాకింగ్ టెక్నాలజీ ఏపీకి ఇవ్వడానికి మేం అంగీకరించామని తెలిపారు.. ఎకో టూరిజంలో ఉన్న అవసరాలను మేం గుర్తించి.. రెండు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందానికి వచ్చామని తెలిపారు.. అటవీ సంపదను, వన్యప్రాణులను కాపాడుకోవడం కోసం ఈ ఎంఓయూ చేసుకున్నాం అన్నారు.. ఇక, కుంకీ ఏనుగులను ఏపీకి పంపించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.. దసరా తర్వాత మావోలతో సహా నాలుగు కుంకీ ఏనుగులను పంపడానికి రెడీగా ఉన్నామని వెల్లడించారు కర్ణాటక మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రే.