Site icon NTV Telugu

Insurance Murder: ఛీ..ఛీ.. ఇలా కూడా డబ్బు సంపాదిస్తారా? రూ. 5కోట్ల జీవితబీమా క్లైమ్ కోసం ఏకంగా..

Cheat Crime News

Cheat Crime News

Insurance Murder: డబ్బు.. మనుషులను ఎంతటి రాక్షసత్వానికైనా ఒడిగట్టేలా చేస్తుంది. కర్ణాటకలో హోస్పేట్‌లో అలాంటి ఘటనే జరిగింది. కొంత మంది అడ్డంగా డబ్బు సంపాదించేందుకు రాక్షసుల్లా స్కెచ్ వేశారు. వారు చేసిన పని చూస్తే.. ఛీ..ఛీ.. ఇలా కూడా డబ్బు సంపాదిస్తారా అనేలా ఉంది. ఇంతకీ ఆ కంత్రీలు ఎవరు? ఏం చేశారు? అసలు కర్ణాటకలోని హోస్పేట్‌లో ఏం జరిగింది? అప్పనంగా డబ్బులు వస్తాయని స్కెచ్ వేశారు. కానీ డామిట్.. కథ అడ్డం తిరగడంతో అడ్డంగా బుక్కయ్యారు. చివరికి డబ్బులు కాదు కదా.. ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే.. సెప్టెంబర్ 28న కర్ణాటకలోని హోస్పేట్‌లో బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అని ఆరా తీసిన పోలీసులు.. హోస్పేట్‌కు చెందిన గంగాధర్‌గా గుర్తించారు. అతని వివరాలు తీసుకుని.. భార్యకు సమాచారం ఇచ్చారు. ఆయన డెడ్ బాడీని పోస్టు మార్టం పూర్తి చేసి అప్పగించారు.

Illegal Liquor: నకిలీ మద్యం కేసులో కీలకంగా మారిన లిక్కర్ డైరీ.. లిస్టులో ప్రముఖుల పేర్లు!

ఇంతవరకు ఓకే.. కానీ రోడ్డు ప్రమాదం అయినప్పటికీ ఆమె ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత పోలీసులు చెప్పిన మాటలు ఆమెను షాక్‌కు గురి చేశాయి. బైక్‌పై వెళ్తున్న గంగాధర్‌ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఢీకొట్టారని చెప్పారు. అక్కడే ఆమెకు డౌట్ వచ్చింది. తన భర్తకు పక్షవాతం ఉందని.. బైక్ నడిపడమేంటని పోలీసులను ఎదురు ప్రశ్నించింది. దీంతో షాకైన పోలీసులు.. అసలు ఏం జరిగిందనేది ఆరా తీయడంతో పక్కా మర్డర్‌గా తేలింది.

పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. గంగాధర్‌పై రూ. 5కోట్ల విలువైన జీవితబీమాతోపాటు రూ. 25 లక్షల ప్రమాద బీమా ఉన్నట్లు గుర్తించారు. డబ్బు కోసం ఆశపడిన గంగావతి మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ క్రిష్ణప్ప, బ్యాంకు ఉద్యోగి యోగరాజ్ సింగ్ తోపాటు మరో నలుగురు కలిసి ముఠాగా ఏర్పడి అనారోగ్యంతో బాధపడుతున్న గంగాధరపై బీమా చేయించినట్లు చెబుతున్నారు. పక్షవాతంతో ఉన్న గంగాధర త్వరలో చనిపోతాడని భావించి డాక్టర్, బ్యాంకు ఉద్యోగి సహాయంతో నిందితులు భారీ మొత్తంతో బీమా చేయించారు. అతడు చనిపోతే వచ్చిన డబ్బు పంచుకోవాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం గంగాధరకు నామినీగా ఓ మహిళ పేరును భార్యగా చూపి ఇన్సూరెన్స్ చేయించారు. ప్రీమియం డబ్బులు సైతం నిందితులే చెల్లించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Marital Torture: భార్యకు కొనిచ్చిన బతుకమ్మ చీరే అతని పాలిట ఉరితాడైంది.. ఆత్మహత్య చేసుకున్న జానపద గాయకుడు

అయితే బీమా చేసిన తర్వాత.. నిందితులు ఆశించినట్లు గంగాధర మరణించ లేదు. దీంతో అతడిని చంపేస్తే డబ్బు వస్తుందని డిసైడయ్యారు. అది కూడా యాక్సిడెంట్‌లా ఉండేందుకు స్కెచ్చేశారు. పథకం ప్రకారం సెప్టెంబర్ 28న గంగాధరను కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఆ తర్వాత ప్రమాదంగా చిత్రీకరించేందుకు హోస్పేట్ శివారులో సండూరు మార్గం వద్ద మృతదేహాన్ని పడేసి కారుతో తొక్కించారు. అయితే మృతుడి భార్య చెప్పిన వివరాలతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో ముఠా గుట్టు రట్టైంది. ఈ వ్యవహారంలో పోలీసులు మరికొందరిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ముఠా గతంలో ఇలాంటి ఘోరాలకు పాల్పడిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడు చనిపోతే.. బీమా డబ్బులు వస్తాయి… నిజమే.. కానీ అతన్ని చంపేస్తే.. నేరస్తులవుతారు. నిందితులు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు అని పోలీసులు అంటున్నారు.

Exit mobile version