Sexual harassment case: కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక ఆరోపణల కేసులో ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర ఇవాళ (మంగళవారం) కీలక వ్యాఖ్యలు చేశారు. రేవణ్ణ భారత్‌కు తిరిగి రాగానే ఎయిర్ పోర్టులోనే అరెస్టు చేయడంపై ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. మే 31వ తేదీన సిట్ ఎదుట హాజరుకానున్నట్టు వీడియో విడుదలైన నేపథ్యంలో రేవణ్ణను విమానాశ్రయంలో దిగగానే అరెస్టు చేస్తారా అనే క్వశ్చన్ కు సమాధానంగా హోం మంత్రి ఈ కామెంట్స్ చేశారు. అలాగే, రేవణ్ణ అరెస్ట్‌లో ఎలాంటి జాప్యం చేయమన్నారు. ఆ వీడియోను విడుదల చేయడానికి అతన్ని ఏ విషయం ప్రేరేపించిందో నాకు తెలియదని హోం మంత్రి పరమేశ్వర అన్నారు.
Read Also: Farmers Suffering: విత్తనాల కోసం రైతన్న కష్టాలు.. ఆగ్రో షాపుల ముందు పడిగాపులు..
ఇక, మే 31వ తేదీన ఏం జరుగుతుందో చూద్దాం అంటూ కర్ణాటక హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర అన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ రాకపోతే, తర్వాత జరగాల్సిన ప్రక్రియ స్టార్ట్ చేస్తామన్నారు. మేము అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం.. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి సైతం లేఖ రాశాం.. ఇప్పటికే వారెంట్ జారీ చేయబడింది. విదేశాంగ మంత్రిత్వ శాఖకు అన్ని వివరాలను సమర్పించాం.. రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసు కూడా జారీ చేశాం.. తదుపరి ఇంటర్‌పోల్ రంగంలోకి దిగుతుందని హోంమంత్రి పరమేశ్వర వెల్లడించారు.
Read Also: Pushpa 2 : “పుష్ప 2” సెకండ్ సింగిల్ అదిరిపోనుందా..?
అయితే, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని అర్థం చేసుకున్న ప్రజ్వల్ రేవణ్ణ తిరిగి వస్తానంటూ వీడియోను రిలీజ్ చేశారు. మే 31తో ఆయన డాక్యుమెంట్ల గడువు ముగిసిపోతుంది. ఎన్నికల్లో అతను ఓడిపోతే అతని దౌత్య పాస్‌పోర్ట్‌ను ఆటోమెటిక్‌గా అధికారులు స్వాధీనం చేసుకుంటారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ తిరిగి ఇండియాకు రావాలని నిర్ణయించుకున్నాడనే విషయం నేను అర్థం చేసుకున్నానని పరమేశ్వర పేర్కొన్నారు.
