NTV Telugu Site icon

Yediyurappa: పోక్సో కేసులో యడియూరప్పకు హైకోర్టులో ఊరట

Yd

Yd

లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు హైకోర్టులో ఊరట లభించింది. పోక్సో కేసుకు సంబంధించి తదుపరి విచారణ జరిగే జూన్ 17 వరకు ఆయనను అరెస్టు చేయకూడదని ఆదేశించింది. మైనర్ బాలికను వేధించారనే ఆరోపణపై నమోదైన పోక్సో కేసులో బెంగళూరు కోర్టు మాజీ ముఖ్యమంత్రిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం చేపడుతోన్న విచారణకు సంబంధించిన ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. జూన్‌ 17న సీఐడీ ముందు యడియూరప్ప హాజరుకానున్నారని, అరెస్టును నిలిపివేయాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. అందుకు న్యాయస్థానం అంగీకరించింది.

ఇది కూడా చదవండి: Penna Cement: అదానీ గ్రూప్ చేతికి పెన్నా సిమెంట్‌.. ఏకంగా 10,422 కోట్లకు కొనుగోలు..

లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన కాంగ్రెస్ నేతలు బీజేపీపై కుట్రలు పన్నుతున్నారని కమలనాథులు ఆరోపించారు. మానసిక స్థితి సరిగా లేని మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా యడియూరప్పను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడింది. ఈ ఏడాది మార్చిలో యడ్యూరప్ప తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాలిక తల్లి బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నాలుగుసార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనపై బాధితురాలి సోదరుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: భిన్నత్వాన్ని చూపించేలా ఏపీ సీఎం ప్లాన్‌.. 10 నుంచి 6 వరకు సచివాలయంలోనే..!