Site icon NTV Telugu

Movie Ticket Prices: ఏ సినిమా థియేట‌ర్స్ అయినా టికెట్ రూ.200 దాటకూడదు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Movie Ticket Prices

Movie Ticket Prices

Movie Ticket Prices: సినిమాలు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా, కుటుంబ సమయాన్ని గడిపేందుకు ఓ మార్గం. ముఖ్యంగా వారం రోజుల పని ఒత్తిడి నుండి బయట పడేందుకు, కొందరు కుటుంబ సభ్యులతో పాటు బయటికి వెళ్లే సరదా మూమెంట్స్‌లో సినిమాలు ప్రధాన భాగంగా నిలుస్తున్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో థియేటర్లలో టికెట్ ధరలు అధికంగా ఉండటంతో మధ్యతరగతి ప్రజలకు ఇది కాస్త భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తాజాగా ఒక ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది.

Read Also:Vijayawada Double murder: బెజవాడలో కలకలం.. సిటీ నడిబొడ్డున ఇద్దరు యువకుల దారుణ హత్య..

ముసాయిదా నోటిఫికేషన్ లో సినిమా టికెట్ ధర గరిష్టంగా రూ.200 మించకూడదని స్పష్టం చేసింది. ఈ పరిమితి రాష్ట్రంలోని అన్ని థియేటర్లకూ, మల్టీప్లెక్స్‌లకూ వర్తించనుంది. ఈ నిర్ణయాన్ని తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో.. ప్రజలందరికీ సినిమాలు చేరువ కావాలి. టికెట్ ధరల భారంతో సామాన్యులు వెనకడుగు వేయడం మానిపించాలి. గతంలో కొన్ని మల్టీప్లెక్స్‌లలో టికెట్లు 500 నుంచి 1000 దాకా ఉంటున్నాయి. ఇది సరైనది కాదని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఇది ముసాయిదా నోటిఫికేషన్ కావడంతో, ఎవరైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లోగా తెలిపేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం.

Read Also:Baahubali: కట్టప్ప బాహుబలిని చంపక పోతే?

ఈ నిర్ణయంపై ప్రజల నుండి హర్షాతిరేక స్పందన లభిస్తోంది. ఇప్పుడైనా సినిమా టికెట్లు అందరికీ చవకగా లభిస్తే, కుటుంబంతో కలిసి తరచూ సినిమాలకు వెళ్లే అవకాశం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు, మల్టీప్లెక్స్ యజమానులు మాత్రం ఈ నిర్ణయం వల్ల తమ ఆదాయంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని అంటున్నారు. కాకపోతే దీనికి కారణం లేకపోలేదు. ప్రీమియం ఫార్మాట్లైన ఐమాక్స్, 4DX వంటి వాటికి భారీగా పెట్టుబడులు పెట్టామని.. వాటికి కూడా రూ.200 ధరకు ప్రదర్శించాలంటే నష్టాలే మిగిలిపోతాయని ఒక మల్టీప్లెక్స్ యజమానూలు వాపోతున్నారు.

Exit mobile version