Karnataka DGP Viral Video: కర్ణాటకలో ఒక సంచలన వీడియో వైరల్‌గా మారింది. కర్ణాటకలో DGP-ర్యాంక్ IPS అధికారి డాక్టర్ రామచంద్రరావు అభ్యంతరకరమైన వీడియో వైరల్ కావడంతో ఒక్కసారిగా రాష్ట్రం షాక్‌కు గురైంది. ఆ వీడియోలో ఈ అధికారి తన అధికారిక యూనిఫామ్ ధరించి, డ్యూటీలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయంలో ఇద్దరు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కనిపిస్తోంది. రహస్యంగా రికార్డ్ చేసిన ఈ వీడియోలో ఆ మహిళలను ఆయన కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది.
READ ALSO: PM Modi UAE President: యూఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలికిన ప్రధాని మోడీ..
ఈ వీడియోపై సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే డాక్టర్ రామచంద్రరావు ఈ వీడియోను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన ఒక నేషనల్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఈ వీడియో పూర్తిగా మార్ఫింగ్ చేసినది, కేవలం తనను టార్గెట్‌గా చేసుకునేందుకు చేసిన కుట్ర అని అభివర్ణించారు. ప్రస్తుతం ఈ వైరల్ వీడియో పోలీసు శాఖలోని క్రమశిక్షణ, నైతిక ప్రమాణాల గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. పలు నివేదికల ప్రకారం ఈ వీడియోలో కనిపించిన ఇద్దరు మహిళలు వేర్వేరు సందర్భాలలో ఈ అధికారి కార్యాలయాన్ని సందర్శించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఆ అధికారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు లేదా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
READ ALSO: Nitin Nabin: జాతీయ స్థాయిలో బీజేపీకి కొత్త సారథి.. రేపే ప్రధాని సమక్షంలో పట్టాభిషేకం!
