Karnataka CM: ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న కర్ణాటక సీఎం సిద్దరామయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అయిదు హామీలు కీలకమైనవి. అందులో ఒకటే.. అన్నభాగ్య పథకం.. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ ప్రతినెలా 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీ పథకం.. ప్రస్తుతం ఈ స్కీమ్ ఆరంభమైంది. ఇవాళ ( సోమవారం) సాయంత్రం బెంగళూరులోని విధాన సౌధలో జరిగిన కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. ఈ పథకాన్ని లాంఛనంగా స్టార్ట్ చేశారు. ఈ పథకంలో సిద్ధరామయ్య సర్కార్ చిన్న మార్పు చేసింది. 10 కేజీల ఉచిత బియ్యాన్ని అయిదు కేజీలకు కుదించింది. అయిదు కేజీల ఉచిత బియ్యాన్ని అందించడంతో పాటు మరో అయిదు కేజీల బియ్యానికి సమానమైన మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ పర్ చేయనున్నట్లు మార్పులు చేసింది.
Read Also: Video Viral: ఏ ఆటోనో, బస్సో కాదు.. ఏకంగా రైలునే నెడుతున్నారు.. వీడియో వైరల్..!
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్‌మన్ గిల్..
ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ పంపిణీ చేసే బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను విధించింది. ఇటీవలే ఇది అమల్లోకి వచ్చింది. ఫలితంగా అన్నభాగ్య పథకాన్ని అమలు చేయడానికి చాలినంత బియ్యాన్ని సిద్ధరామయ్య ప్రభుత్వం సేకరించలేకపోయింది. అందు కోసమే అయిదు కేజీల బియ్యంతో పాటు మిగిలిన అయిదు కేజీలకు సంబంధించిన మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో వేసేలా అన్నభాగ్య స్కీమ్ లో మార్పులు చేసి.. దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీని మళ్లీ టీమిండియాకు కెప్టెన్‌గా చేయొచ్చుగా..
అయిదు కేజీల బియ్యానికి సమానమైన మొత్తం రూ.170.. ఈ మొత్తం.. వచ్చే 15 రోజుల్లోగా లబ్దిదారుల అకౌంట్లకు బదిలీ చేయనున్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 4.42 కోట్ల మందికి ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. గతంలో ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం.. దేశంలో ఆహార భద్రత చట్టాన్ని అమలు చేసింది.. దీన్ని మోడీ సర్కార్ నీరుగారుస్తోందని కన్నడ సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. ఈ చట్టం కింద దేశ ప్రజలందరికీ ఆహార భద్రతను కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..