NTV Telugu Site icon

BJP MLAs Slept Inside Assembly: రాత్రంతా అసెంబ్లీలోనే నిద్రపోయిన ఎమ్మెల్యేలు

New Project 2024 07 25t101623.521

New Project 2024 07 25t101623.521

BJP MLAs Slept Inside Assembly: కర్ణాటక రాజకీయాల్లో బుధవారం ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ పోరు నడుస్తోంది. ఇక్కడ ప్రతిపక్ష నేత ఆర్ అశోక్, బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీవై విజయేంద్ర సహా బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే నిద్రించారు. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) కుంభకోణంపై అసెంబ్లీలో చర్చకు డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు నిద్రపోయి నిరసన వ్యక్తం చేశారు. ఉభయసభల్లో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టింది బీజేపీ. కానీ విపక్షాలను అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్‌ అనుమతించలేదు. ఉభయ సభల్లో ఈ అంశంపై చర్చించేందుకు విపక్షాలు పట్టుబట్టాయి. కానీ.. గందరగోళం మధ్యే ఆర్థిక బిల్లుకు అమోదం తెలిపి సభను వాయిదా వేశారు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్. ముడాకు సంబంధించి తాము (బీజేపీ) వాయిదా తీర్మానం ఇచ్చామని కర్ణాటక శాసన మండలి చైర్మన్ బసవరాజ్ హొరట్టి తెలిపారు.

Read Also:Dowleshwaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

ముడాలో భూములు కోల్పోయిన వారికి స్థలాల కేటాయింపులో భారీగా అక్రమాలు జరిగినట్లు వారు ఆరోపించారు. సుమారు రూ.4వేల కోట్ల కుంభకోణం దీని వెనుక దాగి ఉందని బీజేపీ సభ్యులు ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్యకు అప్పనంగా భూములు ఇచ్చేశారంటూ మండిపడ్డారు. సీఎం సిద్ధరామయ్య తన భార్య పార్వతికి 14 స్థలాలను చట్టబద్ధంగా ఇచ్చారని నిరూపించాలని, బీజేపీ పక్ష నేత ఆర్‌ అశోక డిమాండ్‌ చేశారు. దళితుల భూములను లూటీ చేసి, తన భార్యకు అప్పగించారని ఆరోపించారుకాగా, ముడా కుంభకోణం విలువ రూ.4000 కోట్లు అని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ ఆర్ పాటిల్ అన్నారు. భూసేకరణ, ప్లాట్ల కేటాయింపుల్లో చాలా అవినీతి జరిగిందని… సిద్ధరామయ్య, బీఎస్‌ యడియూరప్ప, బసవరాజ్‌ బొమ్మై ప్రభుత్వాల హయాంలో జరిగిన కుంభకోణాలు బయటపెట్టాలన్నారు. కర్ణాటకలో గత 10-15 ఏళ్లుగా సాగుతున్న ఈ సర్దుబాటు రాజకీయాలకు స్వస్తి పలకాలి. ఈ సర్దుబాటు రాజకీయం బీజేపీకి పెను నష్టం కలిగించిందని మన పార్టీ హైకమాండ్ అర్థం చేసుకోవాలన్నారు. సిద్ధరామయ్య రాజీనామా చేయాలని, ముడా కుంభకోణంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

Read Also:BRS Leaders Team: నేడు కరీంనగర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. గోదావరిఖనిలో బస..

Show comments