Site icon NTV Telugu

Rahul gandhi: రేపు బెంగళూరుకు రాహుల్.. పరువు నష్టం కేసులో హాజరు

Rahul

Rahul

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం బెంగళూరుకు రానున్నారు. బీజేపీ పరువు నష్టం కేసులో బెంగళూరు కోర్టుకు హాజరుకానున్నారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు.. గత బీజేపీ ప్రభుత్వం అవినీతిమయమైందని ఆరోపించారు. దీంతో బీజేపీ నేత ఎస్ కేశవ ప్రసాద్ పరువు నష్టం దావా వేశారు. అయితే శుక్రవారం తమ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే ఈ కేసులో సిద్ధరామయ్య, శివకుమార్‌లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఇది కూడా చదవండి: NCP: అజిత్ పవార్ ఎన్సీపీలో కలవరం.. శరద్ పవార్‌‌కి టచ్‌లో 10-15 ఎమ్మెల్యేలు..

2023 రాష్ట్ర ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ అవినీతికి పాల్పడిందంటూ స్థానిక వార్తాపత్రికల్లో ప్రకటన ఇచ్చింది. దీంతో కర్ణాటక బీజేపీ యూనిట్ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. ఈ కేసులో భాగంగా రాహుల్ గాంధీ గురువారం బెంగళూరులోని స్థానిక కోర్టుకు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే ప్రకటన ప్రచురణలో రాహుల్ గాంధీ ప్రమేయం లేదని కాంగ్రెస్ పేర్కొంది. జూన్ 1న హాజరు కానందుకు రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కర్ణాటక బీజేపీ యూనిట్ కోర్టును కోరింది. అయితే జూన్ 7న తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు పేర్కొంది. అన్ని పబ్లిక్ వర్క్స్ అమలుకు 40 శాతం కమీషన్ వసూలు చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రకటనలో గత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని అవినీతి కార్డును కూడా విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: Akhilesh Yadav: ‘‘ఏం తమ్ముడు, నీకు వేరేలా ట్రీట్మెంట్ ఇవ్వాలా..?’’ జర్నలిస్టుకు అఖిలేష్ బెదిరింపు, వీడియో వైరల్..

Exit mobile version