NTV Telugu Site icon

Karnataka: కర్ణాటకలో చికెన్ కబాబ్, చేపల వంటకాల్లో కృత్రిమ రంగులు నిషేధం..

Chiken Kabab

Chiken Kabab

సాధారణంగా నాన్ వెజ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కబాబ్.. ముఖ్యంగా కబాబ్‌లో చాలా రకాల కబాబ్‌లు ఉంటాయి. ఇటీవల ట్రెండింగ్ అవుతున్న గార్లిక్ కబాబ్, చికెన్ 65, తందూరీ చికెన్, చికెన్ టిక్కా, చికెన్ లాలిపాప్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. అయితే నాన్ వెజ్ లవర్స్ కు ఇదో బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. కర్ణాటకలో చికెన్ కబాబ్, చేపల వంటకాల్లో కృత్రిమ రంగుల వాడకంపై నిషేధం విధించారు. ఇప్పటికే.. గోబీ మంచూరియన్లో వాడే రంగులపై ప్రభుత్వం నిషేధం విధించింది. తాజాగా.. ఈ ఫుడ్ పై నిషేధం విధించింది.

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ హైవేను 6 లైన్ల రహదారిగా మార్చాలని కోరాం..

చికెన్ కబాబ్ లో ఉండే కోళ్లకు రసాయన రంగులు వేస్తున్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలోని 36 ప్రాంతాల నుంచి కబాబ్‌ల నమూనాలను సేకరించి.. పసుపు, క్రిమ్సన్ నమూనాలు లభించడంతో ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఆహార భద్రత, నాణ్యత విభాగం కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిషేధం విధించినట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. అంతేకాకుండా.. ఆహారంలో కృత్రిమ రంగుల వల్ల కలిగే దుష్పరిణామాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన ఆహార భద్రతా శాఖ కమిషనర్‌ను ఆదేశించారు.
Death mystery: మిస్ అయింది ఒక రాష్ట్రంలో.. డెడ్‌బాడీ దొరికింది మరో రాష్ట్రంలో.. అసలేమైంది?

కాగా.. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే 7 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. గోబీ మంచూరియన్, మిఠాయి కాటన్‌లలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన కొన్ని రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.