Site icon NTV Telugu

Karnataka Cricketer Record: వన్డే క్రికెట్లో సంచలనం.. 165బంతుల్లో 407పరుగులు

Karnataka.cricketer

Karnataka.cricketer

Karnataka Cricketer Record: వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు డబుల్.. ట్రిపుల్ సెంచరీలను చూశాం కానీ.. ఇప్పుడు ఏకంగా ఒకే మ్యాచ్ లో 400పరుగులకు పైగా చేసి ఓ కుర్రాడు అందరికీ అవాక్కయ్యేలా చేశాడు. కలలో కూడా ఊహించని ఫీట్ సాధించి అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. గతంలో సచిన్ వన్డే మ్యాచ్ లో 200కొడితేనే ప్రపంచం అబ్బురపడింది. అలాగే టెస్టుల్లో 400కొడితే అమోఘం అన్నారు. ఏకంగా వన్డేలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ 407పరుగులు సాధించి ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును నమోదు చేశాడు కర్ణాటకకు చెందిన తన్మయ్ మంజునాథ్. కర్ణాటక క్రికెట్ సంఘం అండర్-16 టోర్నీలో ఈ పిల్లవాడు చిచ్చరపిడుగులా చెలరేగి చరిత్ర సృష్టించాడు. 50ఓవర్ల మ్యాచ్ లో కేవలం 165 బంతుల్లోనే ఏకంగా 48 ఫోర్లు, 24 సిక్సులతో 407 పరుగులు చేసి.. వన్డే మ్యాచ్‌లో అద్భుతం చేసి చూపించాడు.

Read Also: Sheru Weds Sweety : అంగరంగ వైభవంగా కుక్కల పెళ్లి.. ఖర్చు తెలిస్తే ఆశ్చపోవడం ఖాయం.!

ఆదివారం సాగర్‌ క్రికెట్‌ క్లబ్‌-భద్రావతి ఎన్టీసీసీ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో తన్మయ్‌ మంజునాథ్‌ సాగర్‌ క్రికెట్‌ క్లబ్‌ తరఫున బరిలోకి దిగాడు. దిగిదిగడంతోనే భద్రావతి బౌలర్ల భరతం పట్టాడు. కొడితే సిక్స్‌ లేదంటే.. ఫోర్‌ అనే విధంగా బ్యాటింగ్‌ చేస్తూ.. చరిత్ర ఇంతవరకూ కనివినీ ఎరుగని రికార్డును నమోదు చేశాడు. మంజునాథ్‌ కర్ణాటకలోని శిమమొగ్గా ప్రాంతానికి చెందిన వాడు. సాగర్‌ క్రికెట్‌ క్లబ్‌ తరఫున అండర్‌ 16 పోటీల్లో పాల్గొంటున్నాడు.

Read Also: The Vaccine War: ఆ టైటిల్ ఎందుకు పెట్టానో తెలుసా?.. వివేక్ అగ్నిహోత్రి ట్విట్ వైరల్..

కాగా.. 2014 నవంబర్‌ 13న శ్రీలంక-భారత్‌ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ల్లో రోహిత్‌ శర్మ వన్డేల్లో ఏకంగా 264 పరుగులు బాదేసి.. ప్రపంచ క్రికెట్‌ నివ్వెరపోయేలా చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ వేదికపై రోహిత్‌ సృష్టించిన సునామీ ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డుగా ఉండిపోయింది. రోహిత్‌ సునామీకి సరిగ్గా 8 ఏళ్లు పూర్తయిన రోజునే మంజునాథ్‌ వన్డే మ్యాచ్‌లో ఏకంగా 407 పరుగులు బాదేసి మరో వరల్డ్‌ రికార్డును నమోదు చేశాడు. ప్రస్తుతం ఇండియన్‌ క్రికెట్‌లో మంజునాథ్‌ పేరు మార్మోగిపోతుంది.

Exit mobile version