Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar Tragedy: కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని శంకరపట్నం మండలం పరిధిలో కేశవపట్నం గ్రామంలో తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని తోపుడు బండిపై తీసుకెళ్లిన దృశ్యం స్థానికులను కలచివేసింది. యాకూబ్ అనే యువకుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తండ్రి వీరయ్య అతడిని చెప్పులు కుట్టే దుకాణం దగ్గరికి తీసుకువచ్చి అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా, మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు గ్రామ పంచాయతీకి సమాచారం ఇచ్చినా స్పందన లేకపోవడంతో నిరాశ చెందిన తండ్రి తన కుమారుడి శవాన్ని తోపుడు బండిపై ఇంటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. వరంగల్–కరీంనగర్ హైవే సమీపంలోనే ఇలాంటి ఘటన జరగడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. అత్యవసర సమయంలో కనీస సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, అధికార యంత్రాంగం స్పందించకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ప్రాథమిక సదుపాయాల కొరత కొనసాగుతోందనే విషయాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది.
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!