Cable Bridge: కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిపై బట్టలు ఆరబెట్టిన ఘటన చోటు చేసుకుంది. గతకొన్ని రోజులుగా కేబుల్ బ్రిడ్జ్ నిర్వహణ లేక వాహనదారులకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వందల కోట్ల రూపాయలతో కట్టిన కేబుల్ బ్రిడ్జి కనీసం మూడేళ్లు గడవకముందే ఇలాంటి దుస్థితికి చేరుకుంది. ప్రస్తుతం బ్రిడ్జిపై బట్టలు ఆరేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్ని కోట్లు పెట్టి కేబుల్ బ్రిడ్జ్ కట్టింది బట్టలు అరేసుకోడానికా అంటూ నెటిజన్ల ఫైర్ అవుతున్నారు.
READ MORE: Flipkart, Amazon Sale Deals: బెస్ట్ ఫ్లాగ్ షిప్ మొబైల్ ఆఫర్స్ ఇవే!
కాగా.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 జూన్ 21న మూడు రోజులపాటు ఘనంగా వేడుకలు చేసి మరి కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభించింది. నాటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన కేబుల్ బ్రిడ్జి ప్రారంభమై నేటికి ఏడాదికే రిపేర్లు వచ్చాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో అత్యంత అద్భుత కట్టడంగా.. హైదరాబాద్ తర్వాత కేబుల్ బ్రిడ్జి ఉన్న ప్రాంతంగా కరీంనగర్ నిలుస్తుందని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. సుమారు 234 కోట్లు రూపాయలు ఖర్చు చేసి కట్టిన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిని ఓ ప్రముఖ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి నిర్మాణం చేపట్టారు. కానీ కేబుల్ బ్రిడ్జి ప్రారంభించి ఏడాది అలా అయిందో లేదో అప్పుడే శిథిలావస్థకు చేరుకోవడంపై జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎటు చూసినా రిపేర్లు చేయాల్సిన స్థితికి కేబుల్ బ్రిడ్జి చేరుకుంది.
READ MORE: Minister Satya Kumar: ఏపీలో మెడికల్ కాలేజీలపై వైఎస్ జగన్కు మంత్రి సత్యకుమార్ లేఖ..
కరీంనగర్ నుంచి వరంగల్ వైపు వెళ్లేందుకు మరో మార్గంగా ఉపయోగపడుతున్న కేబుల్ బ్రిడ్జ్ ఏడాదికే రూపులేఖలు మారిపోయాయి. ఒకప్పుడు ఆహ్లాదాన్ని పంచిన అందమైన కేబుల్ బ్రిడ్జి నేడు ఓవైపు కంపుకొడుతూ, సరైన నిర్వహణ లేక కొంత సమయం కూడా దానిపై నిలబడలేని పరిస్థితి నెలకొంది. కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభమై ఆరు నెలలకే మరమ్మతులు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అప్పటి ప్రభుత్వ నేతలకు చెందిన భూములు దీని చుట్టూ ఉన్నాయని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే కేబుల్ బ్రిడ్జ్ నిర్మించారని కరీంనగర్ ప్రజలు చెబుతున్నారు.
