Karbonn Rebel and Rebel Pro 4G Launched: భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కార్బన్ (Karbonn) మళ్లీ మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన కొత్త రెబెల్ సిరీస్‌లో భాగంగా కార్బన్ రెబెల్, కార్బన్ రెబెల్ ప్రో 4G స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. బడ్జెట్ ధరలో భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, క్లీన్ సాఫ్ట్వేర్ వంటి ఫీచర్లను అందిస్తోంది. ఈ రెండు ఫోన్లను అమెజాన్ ఇండియా ద్వారా ప్రత్యేకంగా అమ్మకాలు కొనసాగించనుంది.
కార్బన్ రెబెల్
కార్బన్ రెబెల్లో 6.75 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 650 నిట్స్ గరిష్ఠ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ హీలియో G81 ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు 50MP AI ప్రధాన కెమెరా ఉంది. ఈ ఫోన్లో 7,000mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్‌ను కూడా బాక్స్‌లోనే అందిస్తున్నారు. బ్లూ, గోల్డ్, సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. కార్బన్ రెబెల్ ఫోన్ అసలు ధర రూ.14,999గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్లో భాగంగా రూ.11,999కు అందుబాటులోకి తీసుకొచ్చారు. అదనంగా రూ.1,000 బ్యాంక్ ఆఫర్ పొందితే చివరకు ధర రూ.10,999కు తగ్గుతుంది.
కార్బన్ రెబెల్ ప్రో
రెబెల్ ప్రోలో 6.7 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లేను ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 720 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో పనిచేస్తుంది. ఇందులోనూ మీడియాటెక్ హీలియో G81 ప్రాసెసర్‌నే ఉపయోగించారు. వెనుకవైపు 64MP ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 6,000mAh బ్యాటరీతో పాటు 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. బాక్స్‌లో 20W ఛార్జింగ్ అడాప్టర్, టైప్-సీ కేబుల్ అందిస్తున్నారు. చెర్రీ రెడ్, గోల్డ్, గ్రే, బ్లూ రంగుల్లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. కార్బన్ రెబెల్ ప్రో అసలు ధర రూ.14,999 కాగా, లాంచ్ ధర రూ.12,499గా ఉంది. రూ.1,000 బ్యాంక్ ఆఫర్‌తో ఈ ఫోన్‌ను రూ.11,499కు కొనుగోలు చేయవచ్చు.
ఈ రెండు స్మార్ట్ఫోన్లలోనూ క్లీన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. ముందుగా ఇన్స్టాల్ చేసిన అనవసరమైన థర్డ్ పార్టీ యాప్స్ లేకుండా జీరో బ్లోట్‌వేర్ అనుభవాన్ని కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది. రెండేళ్లపాటు ప్రధాన ఆండ్రాయిడ్ ఓఎస్ అప్గ్రేడ్లు, నాలుగేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందించనుంది. గూగుల్ జెమిని ఏఐ ఇంటిగ్రేషన్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-C పోర్టు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. రెబెల్ సిరీస్‌లో మరో మోడల్‌గా కార్బన్ రెబెల్ 5జీని కూడా కంపెనీ ప్రకటించింది. అయితే దీని పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, లాంచ్ తేదీని త్వరలో వెల్లడించనుంది. ప్రస్తుతం రెబెల్, రెబెల్ ప్రో మోడళ్లు అమెజాన్ ఇండియాలో అమ్మకానికి అందుబాటులో ఉండనున్నాయి.

