పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. గురువారం జరిగిన జూడో పురుషుల 60 కేజీల J1 విభాగంలో కపిల్ పర్మార్ కాంస్యం సాధించాడు. కాంస్య పతక ప్లేఆఫ్‌లో బ్రెజిల్‌కు చెందిన ఎలియెల్టన్ డి ఒలివెరాను 10-0తో ఓడించాడు. కేవలం 33 సెకన్లలో ఆకట్టుకునే ‘ఇప్పన్’తో ఓడించి కాంస్య పతకం గెలుచుకున్నాడు. కాగా.. తాజా పతకంతో పతకాల సంఖ్య 25కి చేరింది. అందులో.. ఐదు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి.
Read Also: CV Ananda: పోలీసులపై బెంగాల్ గవర్నర్ తీవ్ర విమర్శలు.. నేరస్థులున్నారని వ్యాఖ్య
నలుగురు సోదరులు, ఒక సోదరిలో చిన్నవాడైన కపిల్ మధ్యప్రదేశ్‌లోని శివోర్ అనే గ్రామం నుండి వచ్చాడు. అతని తండ్రి టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అతని సోదరి ప్రాథమిక పాఠశాలను నడుపుతోంది. కపిల్ చిన్నతనంలో పొలాల్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ నీటి పంపును తాకడంతో తీవ్ర విద్యుత్ షాక్ తగిలి కోమాలోకి వెళ్లిపోయాడు.