Kapil Dev Birthday: కపిల్ దేవ్ బర్త్ డే.. రజనీకాంత్ ‘లాల్ సలామ్’ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kapil Dev Lal Salaam Movie Poster Released: ‘జైలర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే జై భీమ్ దర్శకుడితో ‘తలైవ 170’ సినిమా చేస్తున్న రజినీ.. తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్లో ‘లాల్ సలామ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లాల్ సలామ్ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
నేడు కపిల్ దేవ్ బర్త్ డే సందర్భంగా లాల్ సలామ్ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో కపిల్ దేవ్, రజనీకాంత్ మైదానంలో నడుచుకుంటూ ముచ్చటిస్తున్నారు. ‘లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్‌కి టీమ్ లాల్ సలామ్ నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు. విజయాలు, నాయకత్వంతో కూడిన మీ ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ సంవత్సరం మీకు ఆనందం మరియు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం’ అని లైకా ప్రొడక్షన్స్ పేర్కొంది.
Also Read
Also Read: Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు నా మొదటి ఛాయిస్ అతడే.. కానీ కుదరలేదు!
టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ లాల్ ఇప్పటికే సలామ్ సినిమాలో తన పాత్రకు సంబందించిన డబ్బింగ్ పూర్తి చేశారు. కపిల్ డబ్బింగ్ చెబుతున్నట్లు ఉండగా.. స్టూడియో రూమ్‌లో డైరెక్టర్ ఐశ్వర్య సలహాలు ఇచ్చారు. ఈ మూవీలో రజనీకాంత్ మొయిదీన్ భాయ్ అనే స్పెషల్ రోల్‌తో అలరించనున్నారు. కపిల్ దేవ్ కోచింగ్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ‘కై పొ చే’ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తుంది. కపిల్ దేవ్ 1983 ప్రపంచకప్ భారత జట్టుకు అందించిన విషయం తెలిసిందే. భారత్ తరఫున కపిల్ దేవ్ 131 టెస్టులు, 225 వన్డేలు ఆడారు.
Team Lal Salaam wishes the legendary @therealkapildev a Happy birthday! 🥳✨ Your journey, marked by triumphs and leadership, is an inspiration to all. May this year be filled with joy and good health! 🤗✨#HBDKapilDev #KapilDev #LalSalaam 🫡 pic.twitter.com/uiC7DBN6xB
— Lyca Productions (@LycaProductions) January 6, 2024
తాజావార్తలు
-
Bitchat: సీజేపీ నిరసనల్లో ఉపయోగించిన ‘‘బిట్‌చాట్’’ యాప్‌పై కేంద్రం చర్యలు..
-
Big Scam: సహకార సొసైటీలో భారీ స్కాం.. ఎరువులు రైతులకు ఇస్తున్నట్లు నమ్మించి రూ.1.60 కోట్లు స్వాహా…
-
CJI Surya kant: సీజేపీ నిరసనల పిటిషన్‌పై సూర్యకాంత్ కీలక ప్రకటన
-
Paper Leak Bill: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు, రూ. 10 కోట్ల జరిమానా.. ఆమోదించిన కేబినెట్..
-
Lothukunta Land Case: లోతుకుంట భూముల కేసులో హైడ్రాకు హైకోర్టు షాక్..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!