NTV Telugu Site icon

Kapil Dev Birthday: కపిల్‌ దేవ్‌ బర్త్ డే.. రజనీకాంత్‌ ‘లాల్ సలామ్’ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్!

Lal Salaam Kapil Dev

Lal Salaam Kapil Dev

Kapil Dev Lal Salaam Movie Poster Released: ‘జైలర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌.. వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ఇప్ప‌టికే జై భీమ్ ద‌ర్శ‌కుడితో ‘త‌లైవ 170’ సినిమా చేస్తున్న రజినీ.. త‌న కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్‌లో ‘లాల్‌ సలామ్‌’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్‌ నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. లాల్‌ సలామ్‌ మూవీలో విష్ణు విశాల్‌, విక్రాంత్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

నేడు కపిల్‌ దేవ్‌ బర్త్ డే సందర్భంగా లాల్‌ సలామ్‌ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో కపిల్‌ దేవ్‌, రజనీకాంత్ మైదానంలో నడుచుకుంటూ ముచ్చటిస్తున్నారు. ‘లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్‌‌కి టీమ్ లాల్ సలామ్ నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు. విజయాలు, నాయకత్వంతో కూడిన మీ ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ సంవత్సరం మీకు ఆనందం మరియు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం’ అని లైకా ప్రొడక్షన్స్ పేర్కొంది.

Also Read: Sandeep Reddy Vanga: ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాకు నా మొదటి ఛాయిస్ అతడే.. కానీ కుదరలేదు!

టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ లాల్‌ ఇప్పటికే సలామ్‌ సినిమాలో తన పాత్రకు సంబందించిన డబ్బింగ్ పూర్తి చేశారు. క‌పిల్ డ‌బ్బింగ్ చెబుతున్న‌ట్లు ఉండ‌గా.. స్టూడియో రూమ్‌లో డైరెక్టర్ ఐశ్వర్య స‌లహాలు ఇచ్చారు. ఈ మూవీలో రజనీకాంత్ మొయిదీన్ భాయ్‌ అనే స్పెషల్ రోల్‌తో అల‌రించ‌నున్నారు. కపిల్‌ దేవ్‌ కోచింగ్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ న‌టించిన ‘కై పొ చే’ సినిమాకు రీమేక్​గా ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తుంది. కపిల్‌ దేవ్‌ 1983 ప్రపంచకప్ భారత జట్టుకు అందించిన విషయం తెలిసిందే. భారత్ తరఫున కపిల్‌ దేవ్‌ 131 టెస్టులు, 225 వన్డేలు ఆడారు.

Show comments