తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాతక్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 18న సీఎం కేసీఆర్ ఖమ్మంలో రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే.. రెండో దశ కంటి వెలుగులో భాగంగా రాష్ట్రంలో అన్ని గ్రామపంచాయతీలు, పురపాలిక సంఘాల పరిధిలోని అన్ని వార్డుల్లో సుమారు కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేయాలనేది వైద్య ఆరోగ్యశాఖ అధికారుల లక్ష్యంగా పెట్టుకున్నారు.
Also Read : Kamar Film Factory: ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్ కోసమే… కమర్ ఫిల్మ్ ప్యాక్టరీ గ్రాండ్ లాంచ్..
అయితే.. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు 88 లక్షల 51 వేల 164 మందికి కంటి పరీక్షలు చేశారు. అందులో భాగంగానే 14 లక్షల 69 వేల మందికి ఉచితంగా రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. ఇన్ఫెక్షన్లు ఉన్న వారికి చుక్కల మందుతో పాటు ఏ,డి, బి కాంప్లెక్స్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి వైద్యులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు 1500 బృందాలతో పాటు బఫర్ బృందాలను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అన్ని మండలాలలో, పురపాలికల్లో అవి పనిచేస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను యూనిట్‌గా తీసుకొని గ్రామాలను ఎంపిక చేశారు. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, అధికారులు గ్రామాల్లో జనాభా వారీగా వివరాలు సేకరించి అందుకు అనుగుణంగా శిబిరాలను నిర్వహిస్తున్నారు.
Also Read : Zakir Naik: హిందువులు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు.. ఇస్లామిక్ బోధకుడి కీలక వ్యాఖ్యలు
