NTV Telugu Site icon

Kantara: కాంతారా ఎఫెక్ట్.. భూత కోల నర్తకులకు అలవెన్స్

New Project (18)

New Project (18)

Kantara: ఇప్పుడ దేశమంతా కాంతారా ఫీవర్ నడుస్తోంది. కథ అదరగొట్టడంతో ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ కాంతారా సినిమా ప్రేక్షకులనే కాకుండా ప్రముఖులను కూడా ఆకట్టుకుంటోంది. తాజాగా కాంతారా ప్రభావంతో కర్ణాటక ప్రభుత్వం ‘దైవ నర్తకాలు’ కోసం నెలవారీ భత్యాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ సభ్యుడు, పిసి మోహన్ కాంతారా సినిమాపై స్పందించారు.

Read Also: Allu Aravind: ఆయన తిడతాడేమోనని ముందే చూపించాను : అల్లు అరవింద్

కన్నడ నటుడు రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. కర్ణాటకలోని అతి పురాతన ఆచారం ‘భూత కోలా’ నృత్యాన్ని దేశవాసులకు పరిచయం చేసింది. కాంతారా సినిమా హిట్టవడంతో ఇప్పుడు అందరూ ఈ వినూత్న ఆచారం గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ప్రభావంతో కర్ణాటక ప్రభుత్వం 60 ఏళ్లు దాటిన ‘భూత కోల’ సంప్రదాయ దైవ నృత్యకారులకు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది. నెలకు రూ. 2000 చొప్పున అలవెన్స్ అందించనున్నట్లు బెంగళూరు సెంట్రల్‌ ఎంపీ పీసీ మోహన్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

Read Also: Kantara Movie: కాంతారాకు బ్రహ్మరథం పడుతున్న బాలీవుడ్ జనాలు

కర్ణాటకలోని దక్షిణ కోస్తా ప్రాంతానికి చెందిన మంగళూరు, ఉడిపి, కుందాపుర లాంటి ప్రాంతాల్లో ఈ ఆరాధన కనిపిస్తుంది. కేరళలోని ఉత్తర మలబార్ ప్రాంతంలోనూ ఇది ప్రాచుర్యంలో ఉంది. వరాహం ఆత్మను పూజిస్తూ జరుపుకొనే పండుగ ఇది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను, భూత కోల నృత్యకారుల హావభావాలను నటుడు రిషబ్ షెట్టి వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. సినిమా క్లైమాక్స్‌లో రిషబ్ శెట్టి ముఖానికి పసుపు రంగు వేసుకుని చేసే నృత్యం, హావభావాలతో పాటు అరుపులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Show comments