Site icon NTV Telugu

Bahubali vs KantaraChapter1 : బాహుబలి ఎపిక్ కు పోటీగా కాంతార ఇంగ్లీష్ వర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే

Kanthara

Kanthara

కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యహరించిన కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి భారీ వసూళ్లు సాధిస్తోంది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా కాంతార భారీ వసూళ్లు రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ. 720 కోట్లకు పైగా వసూలు చేసి దూసుకెళ్తోంది కాంతార. కాగా ఇప్పుడు ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా ఇంగ్లీష్ వర్షన్ థియేటర్స్ లో అడుగుపెట్టనుంది.

బాహుబలి ఎపిక్ :
రాజమౌళి ఎప్పుడూ కొత్త పంథా చూపిస్తాడు. బాహుబలి, భారతీయ సినిమాకి మొదటి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆయనే రీ రిలీజ్ కి కొత్త నిర్వచనం ఇస్తున్నాడు. 2025 అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా బాహుబలి మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. కానీ ఇది పాత సినిమాలా కాదు ఒక కొత్త సినిమాలా, అన్నీ రీ డిజైన్ చేసి ఎక్స్ పీరియన్స్ ది ఎపిక్ అనే కాన్సెప్ట్‌ని మన కళ్లముందుకి తీస్కోస్తున్నాడు.  ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌ ఫ్యాన్స్‌లో ఫైర్ క్రియేట్ చేస్తోంది. ఓవర్సీస్ లో బాహుబలి ఎపిక్ కు కాంతార ఇంగ్లీష్ వర్షన్ నుండి కాస్త పోటీ తప్పేలా లేదు. అయితే బాహుబలి ఎపిక్ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తూ దూసుకెళ్తోంది.

Exit mobile version