NTV Telugu Site icon

Kanpur Test: టెస్టుల్లో టీమిండియా నయా రికార్టు!

Rohit Jaiswal

Rohit Jaiswal

టెస్టుల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సరికొత్త రికార్టు నెలకొల్పింది. అత్యల్ప బంతుల్లో 50 పరుగులు చేసింది. కాన్పూర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 18 బంతుల్లోనే 50 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఈ అరుదైన రికార్డును సాధించారు. దాంతో ఇంగ్లండ్‌ రికార్డు బద్దలైంది. గతంలో ఇంగ్లీష్ జట్టు 26 బంతుల్లో 50 రన్స్ చేసింది. భారత్ టెస్టు క్రికెట్‌లో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ కూడా ఇదే.

రోహిత్ శర్మ 6 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు ఉండగా.. అతడి స్ట్రైక్ రేట్‌ 316.67ఆ ఉంది. యశస్వి జైస్వాల్ 13 బంతుల్లో ఆరు బౌండరీలు, ఒక సిక్సర్‌తో 30 పరుగులు బాదాడు. జైస్వాల్ స్ట్రైక్ రేట్‌ 230.77. ఖలీద్ అహ్మద్ ఒక ఓవర్‌లో 16 పరుగులు ఇవ్వగా.. హసన్ మహ్మద్ 2 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చాడు.

Also Read: Kanpur Test: 233 పరుగులకు బంగ్లా ఆలౌట్.. సిక్సులతో రెచ్చిపోయిన రోహిత్!

మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 99 రన్స్ చేసింది. రోహిత్ శర్మ 23 రన్స్ చేసి ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. జైస్వాల్ 41 బంతుల్లో 68 రన్స్ బాదాడు. జైస్వాల్ సహా శుభమాన్ గిల్ (15) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు బంగ్లా మొదటి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌటైంది. మొమినల్ హక్ (107) సెంచరీ చేశాడు.