NTV Telugu Site icon

Viral Video: మద్యం మత్తులో మరుగుతున్న పాలు మీదపడి వ్యక్తి మృతి (వీడియో)

Up

Up

కాన్పూర్‌లోని బాబు పుర్వా ప్రాంతంలో శనివారం రాత్రి మద్యం మత్తులో ఓ యువకుడు ఫర్నీస్‌లో వండుతున్న పాల బాండీలో పడిపోయాడు. దీంతో తీవ్రంగా కాలిపోయి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దృశ్యాలు దుకాణంలో అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి. సుమేర్‌పూర్ జిల్లా హమీర్‌పూర్‌కు చెందిన మనోజ్‌కుమార్ కాన్పూర్‌లోని కిద్వాయ్ నగర్ కూడలి సమీపంలోని హరి ఓం స్వీట్స్ దుకాణం వద్ద పాలపాన్ సమీపంలోకి వచ్చాడు. అప్పుడు అతడు మద్యం మత్తు ఉన్నాడు. ఈ సమయంలో, అతను పాల పాన్‌లో చేయి పెట్టాడు. పాన్ అతనిపై బోల్తా పడింది. దీంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాబుపూర్వ పోలీస్ స్టేషన్ పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన మనోజ్‌ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మనోజ్ మృతి చెందాడు. కుమారుడు కాన్పూర్‌లో ఒంటరిగా ఉంటున్నాడని, శనివారం రాత్రి అల్పాహారం చేసేందుకు దుకాణానికి వెళ్లాడని అతడి తల్లి తెలిపింది. పాల పాన్ అతనిపై ఎలా పడిందో తెలియడం లేదని వాపోయింది.

READ MORE: Priyanka Gandhi: ‘‘జమాతే ఇస్లామీ మద్దతుతో పోటీ చేస్తోంది’’.. పినరయి వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంకాగాంధీ..

సాయంత్రం నుంచి మద్యం మత్తులో ఉన్నాడని షాపు యజమాని జితేంద్ర సాహు చెబుతున్నారు. అతను రెండుసార్లు షాప్ వైపు వచ్చినప్పుడు.. అతన్ని మందలించి పంపినట్లు తెలిపాడు. ఆ తర్వాత మళ్లీ ఇక్కడి వచ్చాడని.. తాము షాప్‌లో బిజీగా ఉన్నామన్నాడు. అప్పుడు అతను తన చేతితో పాల బాండీని ఢీ కొట్టాడని.. దాని కారణంగా పాన్ పడిపోయిందని పేర్కొన్నాడు. దీంతో తాము అతడిపై నీళ్లు పోసి పోలీసులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. పోలీసులు అతన్ని అంబులెన్స్‌లో ఉర్సలాకు తీసుకెళ్లారన్నారు.

Show comments