Mokshagna : గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య.. మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా షూటింగే లేటు
- మోక్షజ్ఞ ఎలివేషన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలకృష్ణ
- డిసెంబర్ మూడో వారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్
- హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక సెట్లు సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mokshagna : నందమూరి బాలకృష్ణ ఒకవైపు వరుసగా సినిమాలు, టాక్ షోలతో దూసుకుపోతున్నారు. బాలయ్య ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇటీవల 50 ఏళ్లు పూర్తి అయ్యాయి. కాగా బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులతో పాటు టాలీవుడ్ కూడా ఎంతగానో ఎదురు చూస్తోంది. ఒకపక్క మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం స్టార్ హీరోగా ఎదగడం చకచక జరిగాయి. మరొక స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసులు నాగ చైతన్య, అఖిల్ టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు. దీంతో బాలయ్య కొడుకు ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని చాలా కాలంగా చర్చ నడిచింది.
Read Also:AUS vs IND: అశ్విన్ నాకు గురువు.. ఎన్నో విషయాలు నేర్పాడు: ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్
Also Read
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
నిజానికి నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇన్నాళ్లకు బాలయ్య వారసుడు ఎంట్రీ ఫిక్స్ అయింది. హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వెండితెరకు పరిచయం కాబోతున్నాడు మోక్షజ్ఞ. ఈ రోజు మోక్షజ్ఞ పుట్టిన రోజు కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. క్యూట్ లుక్ లో సింపుల్ గా నడుచుకుంటూ చిన్న సింహం మాదిరి కనిపిస్తున్న మోక్షజ్ఞ లుక్ అదరగొట్టింది అని చెప్పాలి. పురాణ ఇతిహాసాల నేపథ్యంలో ఈ చిత్ర కథాశం ఉండబోతున్నట్టు సమాచారం. ఎస్ ఎల్ వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, బాలయ్య చిన్న కుమార్తె మతుకుమిల్లి తేజస్విని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Read Also:Nine-year-old Pegrency girl: చిన్నప్పుడే పెళ్లి.. 9ఏళ్లకే గర్భవతి అయిన బాలిక!.. ఎక్కడంటే?
బాలయ్య తన కొడుకు చిత్ర పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు. డిసెంబర్ మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో బాలయ్య తాజాగా స్క్రిప్ట్ మొత్తం విన్నారని.. బాలయ్యకి స్క్రిప్ట్ చాలా బాగా నచ్చిందని.. ముఖ్యంగా సినిమాలో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాటు మోక్షజ్ఞ క్యారెక్టర్ ఎలివేషన్స్ కూడా బాలకృష్ణకు బాగా నచ్చాయట. మొత్తానికి ఈ సినిమా షూట్ కి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్నట్లు ఈ సినిమా చిత్రీకరణ కోసం ప్రశాంత్ వర్మ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కొన్ని ప్రత్యేక సెట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లోనే ఈ ప్రాజెక్ట్ కూడా ఉండబోతుందని టాక్. మోక్షజ్ఞ సరసన అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ నటిస్తోందని వార్తలు వైరల్ అయ్యాయి.
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!