Site icon NTV Telugu

Kannappa Poster: మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు

Kanappa

Kanappa

Kannappa Poster: మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా సినిమాగా ‘కన్నప్ప’ తెరకెక్కుతుంది. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, మళయాల స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. కన్నప్ప సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తామని గతంలోనే మూవీ మేకర్స్ వెల్లడించారు. ఇకపోతే, ఈ సినిమా మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. కన్నప్ప సినిమా దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోందని టాలీవుడ్ లో టాక్.

Also Read: Minister Ramprasad Reddy: గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి.. స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్‌ పెంపు..

ఇకపోతే, తాజాగా మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న పోస్టర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో మోహన్ బాబు కాషాయపు రంగులో ఉన్న బట్టలు ధరించి సీరియస్ లుక్ తో కనపడుతున్నాడు. విభిన్న సినీ తారాగణం వల్ల సినిమాపై మరింతగా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే కన్నప్ప నుండి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల అంచనాలను భారీగా పెంచగా.. తాజాగా, విడుదలైన మంచు మోహన్ బాబు పోస్టర్ ను కూడా ఇంట్రెస్టింగ్ గా రూపొందించారు.

Also Read: Fake Wedding Card Invitation: వాట్సాప్‌లో తెలియని వివాహ కార్డులపై క్లిక్ చేసారో.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ

Exit mobile version