NTV Telugu Site icon

Kannappa : కనప్పపై ఆసక్తి పెంచుతున్న యానిమేటెడ్ కామిక్ బుక్ వీడియో

Kannappa

Kannappa

Kannappa : హీరో విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ వారం ఒక అప్డేట్ ఇవ్వడానికి చేసిన ప్రకటనకు అనుగుణంగా, ప్రతీ సోమవారం కొత్త సమాచారం అందిస్తున్నారు. సినిమా నుంచి వివిధ పాత్రలను పోషించిన ప్రముఖ నటీనటుల పోస్టర్‌లను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్నారు. ఈసారి, ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్లను మరింత సరికొత్తగా, యానిమేటెడ్ కామిక్ బుక్స్ రూపంలో చేసింది.

డిసెంబర్ 23న, ‘కన్నప్ప యానిమేటెడ్ కామిక్ బుక్-1’ పేరుతో ఓ వీడియో విడుదలైంది. ఈ వీడియోలో భక్తి రసాన్ని సంపూర్ణంగా కళ్ళముందు ఆవిష్కరించే సినిమా ‘కన్నప్ప’ అంటూ ప్రారంభమైంది. ఇందులో, ‘కన్నప్ప ఎవరు?’ అనే ప్రశ్నను పరిష్కరించి, AI టెక్నాలజీ ద్వారా ప్రేక్షకులతో గాఢంగా కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు, ఈ మొదటి భాగం అయిన కామిక్ ఆడియో బుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

‘భక్తి, త్యాగం పరమార్థం’ వంటి లోతైన సందేశాలను ఇస్తున్న ఈ సినిమా, మానవత్వం, దైవత్వం మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించేదే. 5 భాగాలుగా విడుదలయ్యే కన్నప్ప కామిక్ బుక్ ద్వారా ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ‘శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడికి భక్తితో అర్పించబడ్డ కానుక’ అని మేకర్స్ ఈ ప్రాజెక్టును సమర్పించారు.

ఈ యానిమేటెడ్ కామిక్ బుక్ వీడియోలో విజువల్స్, యానిమేషన్ క్లిప్స్ జోడించడం ద్వారా, ఆడియన్స్‌లో మరింత హైప్ క్రియేట్ చేశారు. కన్నప్ప కథ తెలియని వారికి కూడా ఈ వీడియో సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ , కథను వివరించేలా రూపొందించారు.

‘కన్నప్ప’ చిత్రంలో డా. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వంటి ప్రముఖ నటీనటులు నటించారు. ఈ సినిమాటిక్ విజువల్ వండర్, అంకితభావంతో విష్ణు మంచు కథానాయకుడిగా నటిస్తున్న ‘కన్నప్ప’ త్వరలో గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తుండగా, ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు.

Maheshwar Reddy: సీఎం రేవంత్ రెడ్డికి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ..

Show comments