పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘OG’. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులు ఆకలి తీర్చిన సినిమా అని చెప్పాలి. తొలిఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న OG పలు రికార్డులు బద్దలు కొట్టింది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా స్టైలిష్ లుక్ లో కనిపించి అభిమానులకు ఫుల్ ఫీస్ట్ ఇచ్చాడు. వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది OG.
Also Read :MassJathara : మాస్ జాతర ప్రీమియర్స్ కన్ఫమ్.. నాగవంశీ రిస్క్ చేస్తున్నాడా?
ఇంతటి సంచలనాలు క్రియేట్ చేసిన OG సినిమాపై తాజాగా కన్నడ దర్శకుడు ఆర్.చంద్రు ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద కామెంట్స్ చేశాడు. చంద్రు మాట్లాడుతూ ‘ నేను 2023లో రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా ‘కబ్జా’ అనే చిత్రాన్నితీసాను. ఆ సూపర్ హిట్ సినిమాను స్పూర్తిగా తీసుకుని పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాను తీశారు. చాలా వరకు సీన్స్ నా సినిమాను పోలి ఉంటాయి ‘ అని అన్నాడు. చంద్రు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ కన్నడ దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా చూస్తే ఉపేంద్ర ‘కబ్జా’లో అసలు చెప్పుకొదవనికి కథ ఏమి ఉండదు. సినిమా మొత్తం కేవలం ఎలివేషన్స్ మాత్రమే. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన కబ్జా కన్నడలో యావరేజ్ టాక్ తెచ్చుకోగా తెలుగులో సినిమా ప్లాప్ గా మిగిలింది. అలాంటి సినిమా చేసిన కన్నడ దర్శకుడు OG సినిమాపై కామెంట్ చేయడం కాస్త హాస్యాస్పదమనే చెప్పాలి.
