Site icon NTV Telugu

Samyuktha Hegde : చీ..ఛీ.. అవకాశాల కోసం ఇంతలా దిగజారాలా.. హెగ్డేపై నెటిజన్స్ ట్రోలింగ్‌

Hegde

Hegde

అబ్బో ఇప్పటి హీరోయిన్స్ కొందరు సినిమా అవకాశాల కోసమో.. లేక వార్తల్లో ఉండడం కోసమో పడరాని పాట్లు పడుతున్నారు. అదేవిధంగా ఇన్‌స్ట్రాగామ్‌లో ఫాలోవర్స్‌ కోసం గ్లామరస్‌ ఫోటోలను పోస్ట్‌ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.చివరికి బికినీల్లోనూ కనిపించడానికి కూడా వెనుకాడడం లేదు. నటి సంయుక్త హెగ్డే పరిస్థితి ప్రస్తుతం ఇదే. ఈ శాండిల్‌ వుడ్‌ బ్యూటీ ఆ మధ్య బిగ్‌ బాస్‌ రియాల్టీ గేమ్‌ షోలో పాల్గొని హల్‌ చల్‌ చేసింది.

Also Read : IPL 2023 : ఎంఎస్ ధోనీ ఫొటోను షేర్ చేసిన జాన్‌సీనా

కన్నడలో హీరోయిన్ గా పలు మూవీస్ చేస్తున్న సంయుక్త హెగ్డే తమిళంలోనూ జి వీ.ప్రకాష్‌ కుమార్‌ సరసన వాచ్మెన్‌, జయం రవితో కోమాలి, అశోక్‌ సెల్వన్‌ కు జంటగా మన్మధ లీలై, వరుణ్‌కు జతగా పప్పీ వంటి చిత్రాల్లో నటించింది. అయితే వీటిలో చాలావరకు సక్సెస్‌ అయిన సంయుక్తకు మాత్రం పెద్దగా క్రేజ్‌ మాత్రం రాలేదు. దీంతో ప్రస్తుతం తమిళంలో ఒక చిత్రం కూడా చేయలేదు.

Also Read : New police stations: జంటనగరాల్లో 40 కొత్త పోలీస్ స్టేషన్లు.. జీవో జారీ చేసిన తెలంగాణ సర్కార్‌

దీంతో మళ్లీ అవకాశాలను రాబట్టుకోవాలనే ప్రయత్నంలో భాగంగా సోషల్ మీడియాను వేదికగా వాడుకుంటోంది. తన గ్లామరస్‌ ఫొటోలను ఇన్‌ స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అలాంటిది తాజాగా స్విమ్మింగ్ డ్రెస్ ల్లో స్విమ్‌ చేస్తున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతుంది. దీంతో నెటిజన్ల మాత్రం సంయుక్త హెగ్డేను ట్రోలింగ్‌ చేస్తున్నారు. తాను కోరుకున్నదీ ఇదే కాబట్టి ఈ అమ్మడు వాటిపై నోరు కూడా మెదపడం లేదని తెలుస్తోంది. మరి నటి సంయుక్త హెగ్డే ట్రిక్స్‌ ఎంతవరకు ఫలితానిస్తాయనేది చూడాలి.

Exit mobile version