NTV Telugu Site icon

TDP: టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ

Kanna Laxminarayana

Kanna Laxminarayana

Kanna Laxminarayana joins tdp in the presence of chandrababu: మాజీ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు కండువా కప్పి కన్నాను పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులు కన్నాకు అపూర్వ స్వాగతం పలికారు. అలాగే గుంటూరు మాజీ మేయర్, కన్నా కుమారుడు నాగరాజు , తాళ్ల వెంకటేశ్‌ యాదవ్‌, మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా సోదరుడు, బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఎమ్‌ నిజాముద్దీన్‌ తదితరులు టీడీపీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కన్నా అనుచరులు, పలువురు సీనియర్ నాయకులు వేలాది మంది ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు కన్నా లక్ష్మినారాయణ గుంటూరులోని తన నివాసం నుంచి 3వేల మంది కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి తరలి వచ్చారు. కాగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్న కన్నా… ఇప్పటికే తన అనుయాయులతో సమావేశమై వారిని తనతో పాటు పార్టీలో చేర్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

Read Also: Minister Harish Rao: సిద్దిపేటలో కంటి పరీక్షలు చేయించుకున్న మంత్రి హరీశ్‌ రావు

కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడం శుభపరిణామమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కన్నాను పార్టీలోకి సాదరంగా మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు. కన్నా రాకతో టీడీపీ అధికారంలోకి వచ్చేసిందా అన్న వాతావరణం ఏర్పడిందన్నారు. కన్నా మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కన్నా రాష్ట్ర రాజకీయాలలో ఒక ప్రత్యేక ముద్ర వేశారన్నారు. కన్నా వేరే పార్టీలో ఉన్నప్పుడు కన్నాను ఎలాగైనా ఓడించాలని ప్రయత్నం చేశాను.. కానీ పెదకూరపాడులో కన్నాను ఓడించడం నా వల్ల కూడా కాలేదని చంద్రబాబు తెలిపారు. ఓ పద్ధతి, నిబద్ధతతో పని చేసే వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ అంటూ కొనియాడారు. కన్నాను రాజకీయంగా విభేదించుకున్నాం కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు మేం వ్యతిరేకం కాదన్నారు. సైకో పాలన పోవాలంటే కన్నా లాంటి నాయకుల అవసరం ఉందన్నారు.