NTV Telugu Site icon

Kanna Laxminarayana: గెలిచే సత్తా ఉంటే ఇలాంటి దాడులు ఎందుకు?

Kanna

Kanna

వైసీపీ పాలన రక్తం మరిగిన పులి పాలన లా ఉందని మండిపడ్డారు కన్నా లక్ష్మీనారాయణ. జగన్ జైల్లో ఉండి బాగా తర్ఫీదు పొందాడా అన్న అనుమానం ఉంది.. ఈ రాష్ట్రం బీహార్ కన్నా దారుణ మైన ఫ్యాక్షన్ కు వేదిక లా ఉంది.. ప్రతి పక్ష పార్టీ ల కార్యాలయాలు ను టార్గెట్ చేసే రాక్షస పాలన ఎందుకు? నవ రత్నాలు పథకాల తో గెలిచే సత్తా ఉంటే ఇలాంటి దాడులు ఎందుకు? ఏపీలో రాజకీయ దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శించారు. ఈ స్థాయి లో పోలీసు వ్యవస్థ దిగజారడం నా యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదన్నారు కన్నా.

Read Also: AK 62: ఆరేళ్ల తర్వాత రిపీట్ అవుతున్న అజిత్, అనిరుద్ కాంబినేషన్…

జగన్ రాక్షస పాలన ఆపాలి..ప్రజలు తిరగ బడే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నా …బిజెపి మంచి సిద్దాంతాలు కలిగిన పార్టీ..కానీ రాష్ట్రం లో నాయకత్వం సరిగా లేదు..బిజెపి ,టిడిపి కలిసి పోటీ చేయాలా వద్దా అనేది మా అధిష్టానం తీసుకోవాల్సిన అంశం అన్నారు.

Read Also:Raashi Khanna: అందం హిందోళం… అదరం తాబూలం…

Show comments