Site icon NTV Telugu

Kanna Lakhsminarayana : ఇవాళ టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ

Kanna

Kanna

ఏపీలో మాజీ మంత్రి, మాజీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరేందుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆయన్ను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. దీనికి అంగీకరించిన కన్నా టీడీపీలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. గురువారం గుంటూరులోని తన ఇంటి నుంచి 500లకు పైగా కార్లు, వందలాది ద్విచక్రవాహనాలతో కాన్వాయ్‌లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి ర్యాలీగా వెళ్లనున్నారు.

Also Read : Zomato New Service: జొమాటో బంపర్ ఆఫర్! రూ. 89కే ఇంటి భోజనం

మధ్యాహ్నం 2.30 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఇందులో వేలాది మంది అనుచరులు బల నిరూపణలో పాల్గొంటారని భావిస్తున్నారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కన్నా.. గుంటూరు నగరం, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట తదితర అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 150 మందికిపైగా నేతలతో కీలక సమావేశం నిర్వహించగా, మెజారిటీ అభిప్రాయం మేరకు పలు ఎంపికలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే.. టీడీపీలో చేరాలని అనుకున్నారు.

Also Read : High Court: కుక్కల దాడిలో బాలుడు మృతి.. నేడు హైకోర్టు విచారణ

Exit mobile version