Site icon NTV Telugu

Kanguva Runtime: కంగువ రన్ టైం ఎంతో రీవిల్ చేసిన డైరెక్టర్

Kanguva Release Date

Kanguva Release Date

Kanguva Runtime: కోలీవుడ్‌ స్టార్ హీరో సూర్య హీరోగా.. డైరెక్టర్ శివ తెరకెక్కించిన సినిమా ‘కంగువా’. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల కావాల్సిన కంగువా.. సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ‘వేట్టయన్‌’ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కంగువా చిత్రాన్ని నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది.

Read Also:IND vs NZ: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. భారత్-న్యూజిలాండ్‌ తొలి టెస్టు కష్టమే!

కంగువా ద్వారా బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, దిశా పటానీలు కోలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. కిచ్చా సుదీప్‌, యోగిబాబు, జగపతిబాబు, నటరాజన్ సుబ్రమణ్యంలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇందులో సూర్య మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. తెలుగు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మొదటిసారి తమిళంలో నిర్మిస్తున్న మూవీ కావడంతో మన దగ్గర కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Read Also:CM Chandrababu: కొత్త పాలసీలపై ఫోకస్‌.. సీఎం వరుస సమీక్షలు..

కంగువా సినిమా మీద అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. అలానే తమిళంలో రూ.1000కోట్లు కలెక్ట్ చేయగల సత్తా ఉన్న సినిమాగా అంచనా వేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ శివ సినిమా రన్ టైం బయటపెట్టేశాడు. ఈ సినిమాలో ఓల్డ్ పోర్షన్ రెండు గంటలు ఉంటుందట. అంటే కంగువ పాత్రలో సూర్య రెండు గంటల పాటు కనిపించనున్నాడు. ఇక న్యూ పోర్షన్ దాదాపు 25 నిమిషాల పాటు ఉంటుంది. టైటిల్స్ నిడివి పక్కన పెడితే ఈ సినిమా దాదాపు రెండు గంటల 25 నిమిషాల పాటు ఉండబోతుందని తెలుస్తుంది. ఇటీవల కాలంలో చాలా సినిమాల రన్ టైం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సినిమా రన్ టైం టు అవర్స్ 25 మినిట్స్ అంటే ఇటీవల సినిమాలతో పోలిస్తే తక్కువే. ఇది సినిమాకు ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.

Exit mobile version