NTV Telugu Site icon

Gnanavel Raja: వేట్టయన్ గురించి అనలేదు.. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు: కంగువా నిర్మాత

Ke Gnanavel Raja

Ke Gnanavel Raja

తమిళ్‌ స్టార్‌ హీరో సూర్య నటించిన తాజా సినిమా ‘కంగువా’. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మాతగా వ్యవహరించారు. కంగువా నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా రూ.2000 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. అయితే సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత జ్ఞానవేల్‌ రాజా చేసిన వ్యాఖ్యలు నెట్టింట విమర్శలకు దారితీశాయి. తాజాగా వీటిపై ఆయన వివరణ ఇచ్చారు. తనను తప్పుగా అర్థం చేసుకున్నారని, వేట్టయన్ గురించి మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు.

కంగువాలోని నటీనటుల వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచారని జ్ఞానవేల్‌ రాజాను ఓ అభిమాని ప్రశ్నించాడు. ‘ఇటీవల ఓ పెద్ద చిత్రం నటీనటుల వివరాలను ఆ సినిమా ప్రకటించిన రోజే పంచుకుంది. అలా చేయడం వల్ల ఆ చిత్రానికి పెద్దగా ప్రయోజనం కలగలేదు. కనీసం ఓపెనింగ్స్‌కు కూడా ఉపయోగపడలేదు. అందుకే కంగువాలోని నటీనటుల గురించి వివరాలు షేర్ చేయలేదు’ అని జ్ఞానవేల్‌ బదులిచ్చారు. రజనీకాంత్‌ ‘వేట్టయన్’ సినిమా గురించే జ్ఞానవేల్‌ పరోక్షంగా మాట్లాడారని చాలామంది అందుకున్నారు. సోషల్ మీడియాలో ఆయనపై విమ్మర్శలు వచ్చాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలపై జ్ఞానవేల్‌ రాజా క్లారిటీ ఇచ్చారు. ‘నేను చెప్పిన పెద్ద సినిమా ఖేల్‌ ఖేల్‌ మే. ఈ సినిమాలోని నటీనటుల వివరాలను చిత్ర యూనిట్ ముందే పంచుకుంది. ఎంతో మంది అగ్ర నటీనటులు ఉన్నప్పటికీ.. ఆ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఇదే మాట చెప్పాను. నేను ఏ సినిమా గురించి చెప్పానని అప్పుడు ఎవరూ అడగలేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రాసుకున్నారు. ఇక వదిలేయండి’ అని రాజా చెప్పుకొచ్చారు.

Show comments