NTV Telugu Site icon

Kangana Ranaut: తొలిసారి పార్లమెంట్ లో కంగనా రనౌత్ ప్రసంగం..ఏం మాట్లాడారంటే.?

Kangana Ranaut

Kangana Ranaut

హిమాచల్, మండి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తన రాజకీయ యాత్రను ప్రారంభించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆమెకు తొలిసారి పార్లమెంటులో మాట్లాడే అవకాశం వచ్చింది.
లోక్‌సభ స్పీకర్ ముందు కంగనా రనౌత్ తన అభిప్రాయాలను అందజేస్తూ మండి ప్రజల కోసం కొన్ని కోరికలు కోరారు. గౌరవనీయులైన స్పీకర్ జీ, నా తరపున మరియు మండి ప్రజల తరపున నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను… మొదటిసారిగా మండి ప్రాంతం గురించి మాట్లాడే అవకాశం మీరు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

READ MORE:Facebook Friend: అమెరికా యువతితో ఫేస్బుక్లో పరిచయం.. ఇండియాకు రప్పించి అత్యాచారం

“మన మండి ప్రాంతంలో చాలా కళా శైలులు ఉన్నాయి. అవి అంతరించిపోతున్నాయి. హిమాచల్ ప్రాంతంలో ఇల్లు కట్టుకునే కళ అద్భుతం. ఇక్కడ గొర్రెలు, యాక్ ఉన్నితో రకరకాల బట్టలు తయారు చేస్తారు. ఇక్కడ తయారు చేసే జాకెట్లు, స్వెటర్లు, శాలువాలు మరియు క్యాప్స్ వంటివి విదేశాలలో చాలా విలువైనవి. హిమాచల్ సంగీతానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా స్పితి లేదా కిన్నౌర్ మరియు భర్మౌర్ ప్రాంతంలో కనిపించే సాంప్రదాయ దుస్తులు, 8 జానపద రూపాలు కూడా అంతరించిపోతున్నాయి. వాటిని రక్షించాల్సిన బాధ్యతమ మన భుజాలపై ఉంది.” అని ప్రసంగించారు.

READ MORE: Facebook Friend: అమెరికా యువతితో ఫేస్బుక్లో పరిచయం.. ఇండియాకు రప్పించి అత్యాచారం

కాగా.. నటి కంగనా రాబోయే చిత్రం ‘ఎమర్జెన్సీ’ సెప్టెంబర్ 6న థియేటర్లలోకి రానుంది. ముందుగా ఈ సినిమా జూన్ 4న విడుదల కావాల్సి ఉండగా, ఆ తర్వాత విడుదల తేదీని వాయిదా వేశారు. కంగ‌న్‌తో పాటు అనుప‌మ్ ఖేర్, మిలింద్ సోమ‌న్, మహిమా చౌద‌రి, శ్రేయాస్ త‌ల్పాడే కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు.