Tejas : ఓటీటీలోకి వచ్చేస్తున్న కంగనా రనౌత్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ “తేజస్”..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించిన ‘తేజస్’ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సర్వేశ్ మేవారా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కంగనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్ర పోషించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. ఇప్పుడు తేజస్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.తేజస్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.. 2024 జనవరి 5వ తేదీన తేజస్ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా జీ5 అధికారికంగా వెల్లడించింది. అయితే, ఈ మూవీ తెలుగు లో ఈ మూవీ అందుబాటులోకి వస్తుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
తేజస్ చిత్రంలో ఆనుశ్ చౌహాన్, ఆశిష్ విద్యార్థి, విశాక్ నాయర్, కశ్యప్ సంఘారీ, రియో కపాడియా మరియు మోహన్ అగ్సే కీలకపాత్రలు పోషించారు. సర్వేశ్ మేవర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శశ్వాంత్ సచ్దేవ్ సంగీతం అందించారు. ఆర్ఎస్వీపీ మూవీస్ పతాకంపై రోనీ స్క్రీవాలా ఈ మూవీని నిర్మించారు.సుమారు రూ.60 కోట్ల బడ్జెట్‌తో తేజస్ చిత్రం తెరకెక్కింది.అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. కనీసం రూ.10కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేక పోయింది.ఈ సినిమా కంగనా కెరీర్లో మరో డిజాస్టర్ గా నిలిచింది.దేశానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఉన్న భారతీయ స్పైని కాపాడే మిషన్‌ను భారత వైమానిక దళం పైలట్ తేజస్ గిల్ (కంగనా రనౌత్) చేపడతారు. ఆ స్పైని తేజస్ కాపాడారా..మిషన్ సక్సెస్ అయిందా అనేదే తేజస్ సినిమా కథ..కంగనా ఈ ఏడాది నటించిన సౌత్ మూవీ చంద్రముఖి 2 కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.
Also Read
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..