బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరుకి పరిచయం అక్కర్లేదు.. తెలుగులో కూడా సినిమాలు చేసింది.. అంతేకాదు నిత్యం ఏదోక వార్తపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది.. అలాగే ఈసారి కూడా కంగనా మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా అయోధ్య రామమందిరం వద్ద కంగనా రనౌత్ సాంప్రదాయ వస్త్ర దాహరణలో మెరిసింది. అక్కడ స్వామిజీలని కలుసుకుంది.. అందుకు సంబందించిన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
బాలీవుడ్ లో కంగనా రనౌత్ కు గిట్టని వారు చాలా మందే ఉన్నారు. కొందరి పేర్లు వింటేనే కంగనా కోపంతో రగిలిపోతుంది. ఇక మీడియా ముందు కూడా కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేస్తుండడం చూస్తూనే ఉంటాం.. ఇకపోతే ఈరోజు అయోధ్య లో ప్రాణ ప్రతిష్ట సందర్బంగా అయోధ్యకు వెళ్లింది.. చాలా కాలంగా కంగనా హిందూ భావజాలంతో తరచుగా పోస్ట్ లు చేయడం చూస్తూనే ఉన్నాం.. అంతేకాదు ఎన్నో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది..
ఇక ఇప్పుడు అయోధ్య రామమందిరం వద్ద కంగనా రనౌత్ సాంప్రదాయ వస్త్ర దాహరణలో మెరిసింది. అక్కడ స్వామిజీలని కలుసుకుంది. ఆలయ ప్రాంగణంలో చీపురు పట్టి శుభ్రం చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం.. ఆ ఫోటోలలో చీరకట్టులో చాలా అందంగా రెడీ అయ్యింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి..
