NTV Telugu Site icon

Kangana Ranaut: బాబోయ్.. రాజకీయాలకంటే సినిమాలు చాలా ఈజీ.. హీరోయిన్ కామెంట్స్..

Kangana Ranaut

Kangana Ranaut

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హిరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం లోక్‌స‌భ ఎన్నికల కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లోని ‘మండి’ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా పోటీ చేస్తున్నారు. అయితే, ఈ బామ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లో ఈ ప్రచారం గురించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ ను పోస్ట్ చేసింది.

Read Also: Jagapathi Babu : జపాన్ లో జగ్గూ భాయ్ క్రేజ్ మాములుగా లేదుగా..

నిత్యం రోడ్‌ షో లు, బహిరంగ సభలు, పార్టీ అధికారులతో సమావేశాలు, కఠినమైన పర్వత రహదారులపై రోజులో 450 కి.మీలు, నిద్రలేని రాత్రులు, సమయానికి భోజనం చేయకపోవడం, అన్నీ గమనించడం నేర్చుకున్నాక.. సినిమా కంటే రాజకీయ ప్రచారం చాలా కష్టం. ఈ కష్టం ముందు సినిమా తీయడం అంటే ఏదో ఒక జోక్ అని రాశారు.

సినిమాల గురించి చెప్పాలంటే… కంగనా రనౌత్ తన సొంత దర్శకురాలిగా నటించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. దివంగత భారత ప్రధాని ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కంగనా.. ఇందిరాగాంధీ పాత్రను పోషిస్తోంది. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సుమన్, శ్రేయాస్ తల్పాడే తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 14న థియేటర్లలోకి తీసుకురావాల్సి ఉండగా, లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు.

Show comments