NTV Telugu Site icon

Kangana Ranaut: కంగనా రనౌత్‌ పోస్ట్ పై స్పందించిన నేతాజీ కుటుంబ సభ్యులు..!

2

2

నటి, ప్రస్తుత బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ “నేతాజీ భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి” అనే వ్యాఖ్యపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. X లో ఒక పోస్ట్‌ లో కథనాన్ని సుభాష్ చంద్రబోస్ యొక్క మనవడు చంద్ర కుమార్ బోస్ పంచుకుంటూ.., “ఎవరూ తమ రాజకీయ ఆశయం కోసం చరిత్రను వక్రీకరించకూడదు” అని అన్నారు. “నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక రాజకీయ ఆలోచనాపరుడు, సైనికుడు, రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గలవాడు అలాగే వీడిపోని భారతదేశానికి 1వ ప్రధానమంత్రి. భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడటానికి అన్ని వర్గాలను భారతీయులుగా ఏకం చేయగల ఏకైక నాయకుడు. నాయకుడికి నిజమైన గౌరవం ఆయనను అనుసరించడమే అసలైన భావజాలం” అని చంద్ర కుమార్ బోస్ మరో పోస్ట్‌ లో పేర్కొన్నారు.

Also read: Veterinary student Case: వయనాడ్ స్టూడెంట్ డెత్ కేస్.. 29 గంటల పాటు సీనియర్ల దాడి..

ఇకపోతే చంద్ర కుమార్ బోస్ గత ఏడాది సెప్టెంబర్‌ లో బీజేపీకి రాజీనామా చేశారు, తన సిద్ధాంతాలు పార్టీకి పొత్తులో లేవని చెప్పారు. భారత్ వర్సెస్ భారత్ గొడవల మధ్య ఆయన రాజీనామా చేశారు. హిమాచల్ ప్రదేశ్‌ లోని మండి నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన కంగనా రనౌత్ నేతాజీపై చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్‌లు రావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్స్‌పై వచ్చిన వార్తా కథనం స్క్రీన్‌షాట్‌ ను షేర్ చేస్తూ., కంగనా రనౌత్ తనను ట్రోల్ చేస్తున్న వారిని చరిత్ర భాగాన్ని చదవమని కోరింది. నేతాజీ 1943లో సింగపూర్‌ లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొలి ప్రధానిగా ప్రకటించుకున్నారని ఆ కథనం పేర్కొంది.

Also read: Tellam Venktrao : కాంగ్రెస్‌లోకి తెల్లం వెంకట్రావ్‌

అయితే కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కొందరు విపక్ష నేతలు విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ నేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి తనయుడు కెటి రామారావు బిజెపి అభ్యర్థిని పేరు చెప్పకుండా ఎక్స్‌ లో ఎగతాళి చేశారు. “మాకు మొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని ఉత్తరాదికి చెందిన ఒక బీజేపీ అభ్యర్థి చెప్పారు.. అలాగే దక్షిణాదికి చెందిన మరో బీజేపీ నాయకుడు మహాత్మాగాంధీ మా ప్రధానమంత్రి అని చెప్పారు అంటూ.. ఈ ప్రజలందరూ ఎక్కడ నుండి పట్టభద్రులయ్యారు..?” అంటూ ట్వీట్ చేశాడు.