Site icon NTV Telugu

JP Nadda: కంగనా రనౌత్‌ను బీజేపీలోకి స్వాగతం పలుకుతాం.. కానీ..

Jp Nadda

Jp Nadda

JP Nadda: బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ బీజేపీ అవకాశం కల్పిస్తే లోక్‌సభ ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. నటి కంగనా రనౌత్ రాజకీయాల్లోకి రావడం గురించి, హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి 2024లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేయడంపై మీడియా ఆయనను ప్రశ్నించగా.. ఆయన జవాబిచ్చారు. బీజేపీలోకి అందరికీ స్వాగతం పలుకుతామని, అయితే ఎన్నికల ముందు సీట్ల కేటాయింపుపై సంప్రదింపుల ప్రక్రియ తర్వాత నిర్ణయం తీసుకుంటామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు.

కంగనా రనౌత్ శనివారం మాట్లాడుతూ.. ప్రజలు కోరుకున్నట్లయితే, బీజేపీ తనకు టిక్కెట్ ఇస్తే హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ సీనియర్‌ రాహుల్‌ గాంధీ మోడీకి పోటీ కాదని, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆప్‌ కన్వీనర్ కేజ్రీవాల్‌ ప్రకటించే ఉచితాలు పనిచేయవని ప్రకటించారు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత దేశంలో మార్పు కనిపిస్తోందన్నారు. ప్రతి భారతీయుడిలో జాతీయభావం కనిపిస్తోందన్నారు. అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కంగత్‌ రనౌత్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జేపీ నడ్డా ఈ విధంగా స్పందించారు.

South Korea: హాలోవీన్‌ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 150 మంది మృతి

“కంగనా రనౌత్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాము. పార్టీతో కలిసి పనిచేయాలనుకునే వారికి తగినంత స్థలం ఉంది. అయితే ఎన్నికల్లో పోటీ చేయడం నా ఒక్కడి నిర్ణయం కాదు. కింది స్థాయి నుండి సంప్రదింపుల ప్రక్రియ ఉంది. ఎన్నికల కమిటీ నుంచి పార్లమెంటరీ బోర్డు వరకు స్థాయి’’ అని జేపీ నడ్డా అన్నారు.

Exit mobile version