Kangana Ranaut : నేను నటించిందే అసలైన చంద్రముఖి పాత్ర.. ఆమెతో నన్ను పోల్చవద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చంద్ర ముఖి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు పి. వాసు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. అయితే చంద్రముఖి అనగానే వెంటనే గుర్తొచ్చే హీరోయిన్ జ్యోతిక. చంద్రముఖి సినిమాకు ముందు తర్వాత చాలామంది ఈ పాత్రలో నటించినా కూడా జ్యోతిక ఆ పాత్రలో అద్భుతంగా నటించింది.అయితే చంద్రముఖి కథ ఆధారంగా తెరకెక్కి చాలా సంవత్సరాల క్రితం విడుదలైన నాగవల్లి సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో నటించిన రిచా గంగోపాధ్యాయ ఆ పాత్ర ఆమెకు సెట్ అవ్వలేదనే వార్తలు కూడా వచ్చాయి.. దీనితో దర్శకుడు పి. వాసు చాలా సంవత్సరాల తరువాత రజనీకాంత్ తో చంద్రముఖి సీక్వెల్ తెరకెక్కించాలని అనుకున్నారు కానీ ఆయన ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో లారెన్స్ హీరో గా చంద్రముఖి 2 సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా ఈ నెల 15వ తేదిన థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కంగనా రనౌత్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.. కంగనా తాజాగా మాట్లాడుతూ తాను తమిళంలో నటించిన మూడో మూవీ చంద్రముఖి2 అని ఆమె అన్నారు. తాను గతంలో తెరకెక్కిన చంద్రముఖి సినిమాను చూశానని ఆ సినిమాలో జ్యోతిక నటన ఎంతగానో నచ్చిందని కంగనా రనౌత్ తెలిపారు.జ్యోతిక నాకు స్పూర్తి అని ఆమె చెప్పుకొచ్చారు. అయితే జ్యోతికతో మాత్రం నన్ను పోల్చుకోవద్దని కంగనా కామెంట్లు చేశారు. నేను నటించిన పాత్ర మాత్రమే అసలైన చంద్రముఖి అని కంగనా తెలిపారు.కామెడీ, హర్రర్, ఫ్యామిలీ, ఇలా అన్ని అంశాలు ఉన్న సినిమాలో నటించడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె కామెంట్లు చేశారు. ప్రస్తుతం కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు