Joy E Bike: ఇప్పుడంతా ఈవీ వెహికల్స్‌వైపు చూస్తున్నారు ప్రజలు.. దీంతో, వారికి అందుబాటులో ఉండే విధంగా వివిధ సంస్థలు.. తమ షోరూమ్‌లను ప్రారంభిస్తున్నాయి.. ఇప్పుడు జంటనగరాల ప్రజలకు “జాయ్ ఇ-బైక్” షోరూమ్ కూడా అందుబాటులోకి వచ్చింది.. “జాయ్ ఇ-బైక్” యొక్క మొదటి షోరూమ్‌ను జెయింట్ కిల్లర్, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రారంభించారు.. సికింద్రాబాద్ బోయిన్‌పల్లి తాడ్‌బండ్ క్రాస్ రోడ్స్ లో ఏర్పాటు చేసిన హైదరాబాద్ జంటనగరాల్లో “జాయ్ ఇ-బైక్” బ్రాండ్‌కు ఇదే మొట్టమొదటి షోరూమ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ.. ఎక్కువ మంది ప్రజలు ‘ఇ’ బైక్‌ల పట్ల ఆకర్షితులవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇంధనం మరియు నిర్వహణ ఖర్చులను తగ్గించి పర్యావరణానికి ఇది ఎంతో దోహదపడుతుందని అన్నారు. ‘ఇ’ వాహనాలను ప్రోత్సహించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతో చొరవ చూపి, ప్రోత్సహిస్తుందని వెల్లడించారు.
Read Also: Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిర హారతి, దర్శన సమయాల్లో మార్పు.. కొత్త టైమింగ్స్ ఇవే..
ఇక, షోరూమ్ ప్రారంభం సందర్భంగా ఎల్‌స్టారా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సామల శ్రీకాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. “జాయ్ ఇ-బైక్” కి తెలంగాణ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నందుకు తాము గర్వపడుతున్నామని చెప్పారు. జంట నగరాల్లో ఇదే మొట్టమొదటి డిస్ట్రిబ్యూటర్ షోరూమ్ అని ఆయన తెలిపారు. మేం తెలంగాణ అంతటా తమ డీలర్ నెట్‌వర్క్ ను విస్తరించాలని భావిస్తున్నామని అన్నారు. సమీప భవిష్యత్తులో తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ “జాయ్ ఇ-బైక్” లను అందుబాటులో ఉంచాలని ఆలోచన చేస్తున్నామని చెప్పారు. “జాయ్ ఇ-బైక్” లు చాలా తక్కువ ధరలలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంకా అధిక వేగంగా ప్రయాణించగలిగే సామర్థ్యం కూడా కలిగి ఉన్నాయన్నారు. రిజిస్ట్రేషన్ మరియు నాన్-రిజిస్ట్రేషన్ వేరియంట్ లతో రూ.80,000/- నుండి 1,50,000/- వరకు వీటి ధరలు ఉన్నాయని వివరించారు. ‘ఇ’ బైక్ కొనుగోలు పై ఆసక్తి గలవారు ఆందరూ తమ షోరూమ్ ను సందర్శించి “జాయ్ ఇ- బైక్” లను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. తమ షోరూమ్ నుప్రారంభించేందుకు తన విలువైన సమయాన్ని కేటాయించినందుకు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.