Site icon NTV Telugu

Venkata Ramana Reddy: బండి సంజయ్ ను కలిసిన కామారెడ్డి విన్నర్

Katipalli

Katipalli

కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించిన జెయింట్ కిల్లర్, బీజేపీ ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి ఈరోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిశారు. తనను కలిసేందుకు కామారెడ్డి నుంచి కరీంనగర్ అనుచరులతో కలిసి వచ్చిన వెంకటరమణారెడ్డిని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు అర గంటకు పైగా సమావేశం అయ్యారు. కామారెడ్డిలో తన గెలుపుకు దోహదపడిన అంశాలతో పాటు కార్యకర్తల కృషి చేయడంతో పాటు పార్టీకి సహకారం వంటి అంశాలపై చర్చించారు. మరో వైపు బండి సంజయ్ పార్టీ కార్యకర్తల ఆహ్వానం మేరకు ఈరోజు మధ్యాహ్నం ముగ్దుంపూర్ వెళ్లి మల్లన్న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రేకుర్తిలోని రాజశ్రీ గార్డెన్ లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఎన్నికల్లో కష్టపడి పని చేశారని అభినందించిన బండి సంజయ్ వారితో కలిసి భోజనం చేశారు..

Read Also: YCP vs TDP: హైదరాబాద్‌లో ఏపీ ఓటర్ల రిజిస్ట్రేషన్..! టీడీపీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

అంతకు ముందు.. కాటిపల్లి వెంకటరమణా రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఏడాదికి ఒకసారి రేషన్, పెన్షన్లను అప్ డేట్ చేయాలని సూచించారు. కామారెడ్డిలో అవినీతిరహిత పాలన అందేలా చూస్తానని ఆయన చెప్పారు. తాను ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తానని కాటిపల్లి స్పష్టం చేశారు. కామారెడ్డిని అభివృద్ధి దిశగా తీసుకు వెళ్తాను.. తనకు విజయాన్ని అందించిన బీజేపీ కార్యకర్తలకు, ప్రజలకు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Exit mobile version