కడప జిల్లాలో కమలాపురంలో ఈసారి రవీంద్రనాథ్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో కమలాపురం కోటపై పసుపు జెండా ఎగరడం ఖాయమా.. కడప జిల్లాలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న కమలాపురం అసెంబ్లీ ఎన్నికలపై వచ్చిన లేటేస్ట్ సర్వేతో ఎమ్మెల్యే వర్గాన్ని టెన్షన్‌లో పడేసిందా.. టీడీపీ నేత పుత్తా కమలాపురం కింగ్ కాబోతున్నారా అనే అనుమానాలు కనిపిస్తున్నాయి. అయితే, కడప జిల్లాలో మండుటెండలను మించి కమలాపురం రాజకీయం నిప్పులు చెరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథరెడ్డికి, టీడీపీ అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డికి మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. అయితే, గత ఎన్నికల్లో ఓడిపోయినా పుత్తా ఎక్కడా తగ్గలేదు.. 5 ఏళ్లుగా ప్రజల్లోనే ఉంటూ.. ప్రజల సమస్యలపై పోరుబాట పట్టిన పుత్తాకు నియోజకవర్గవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
Read Also: Dharmapuri Arvind: దేశానికి మోడీ తప్ప ఏ గ్యారంటీ లేదు
అయితే, కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి సపోర్టుగా షాకింగ్ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈసారి రాబోయే ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి ఓటమికి తప్పదన్న ఆ సర్వే రిపోర్ట్ లో వెల్లడైందని పుత్తా ఫ్యామిలీ తెలిపింది. కమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు వారు పేర్కొన్నారు. నియోజక వర్గానికి నిధులు తీసుకురావడంలో రవీంద్రనాథ్ రెడ్డి ఫెయిల్ అయ్యాడని ప్రజలు భావిస్తున్నారని పుత్తా చైతన్య రెడ్డి తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామగ్రామానా పర్యటిస్తూ.. ప్రజా సమస్యలను తీర్చడంలో విఫలమైన రవీంద్రనాథ్ రెడ్డి అసమర్థతతో పాటు ఆయన అనుచరుల అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నామన్నారు. అంతే కాదు టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అలాగే, ఎమ్మెల్యేపై కోపంతో ఉన్న కీలక నేతలను, క్యాడర్‌ను, తటస్థులను సైతం సైకిలెక్కించారు. పుత్తా చైతన్య రెడ్డి దూకుడుతో కమలాపురంలో సైకిల్ పార్టీ ఫుల్ స్పీడ్‌తో దూసుకుపోతుంది.
ఇక, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేతిలో ఓడిపోయినా.. నిత్యం ప్రజల్లోనే ఉంటున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా చైతన్యరెడ్డికి ప్రజల్లో సింపతీ బాగా పెరిగింది. కాగా, 2009 నుంచి ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరలేదు.. అయినా నిరాశ చెందకుండా పుత్తా కమలాపురం ప్రజలతోనే మమేకమై పని చేస్తున్నారు. అధికారంలో లేకపోయినా సొంత డబ్బులతో ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటు.. పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన పుత్తా ఫ్యామిలీ కమలాపురం ప్రజలకు దగ్గరైంది. ఇప్పటికే అవినీతి పాలనపై విసుగెత్తిన కమలాపురం ప్రజలు ఈసారి నిత్యం ప్రజల్లో ఉండే పుత్తాను గెలిపించుకోవాలని డిసైడ్ అయ్యారని టాక్. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో గట్టెక్కిన రవీంద్రనాథ్ రెడ్డికి ఈసారి ఎన్నికల్లో పుత్తా చైతన్య రెడ్డి చేతిలో షాక్ తప్పదని కమలాపురంలో చర్చ జరుగుతోంది. మొత్తంగా కమలాపురం కోటపై ఈసారి టీడీపీ జెండా రెపరెపలాడడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
