Site icon NTV Telugu

Kamal Nath : పోవాలనుకునే వారు పోవచ్చు.. మేము ఆపం..

Kamal Nath Congress

Kamal Nath Congress

కాంగ్రెస్‌ను వీడివారే సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ బలహీన పడుతోందా అంటే అవుననే అన్నట్లు సమాధానం వస్తోంది. అయితే.. పార్టీని వీడి వెళ్లే వారిని ఆపమని అంటున్నారు సీనియర్‌ నేతలు. ఈ క్రమంలోనే.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ సోమవారం మాట్లాడుతూ.. తమ పార్టీ ఎవరినీ అడ్డుకోదని, ఎవరు పార్టీని వీడి బీజేపీలో చేరాలనుకుంటే వారు స్వేచ్ఛగా వెళ్లవచ్చని అన్నారు. ‘బీజేపీలో చేరాలనుకునే వారు వెళ్లవచ్చు. మేము ఎవరినీ ఆపాలని కోరుకోవడం లేదు. వాళ్లు (కాంగ్రెస్ నేతలు) వెళ్లి బీజేపీతో కలిసి తమ భవిష్యత్తు చూడాలనుకుంటే, వెళ్లి బీజేపీలో చేరేందుకు నా కారు వారికి అప్పుగా ఇస్తాను. కాంగ్రెస్‌ ఎవరినీ వెళ్లకుండా ఆపదు’ అని మాజీ ముఖ్యమంత్రి అన్నారు.

 

కమల్‌నాథ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. “ఎవరైనా కాంగ్రెస్‌ను విడిచిపెట్టినంత మాత్రాన, పార్టీ ముగిసిందని మీరు అనుకుంటున్నారా?” అని ప్రశ్నించారు. “ప్రజలు తమ స్వంత ఉద్దేశ్యంతో చేస్తారు, ఒత్తిడితో ఎవరూ ఏమీ చేయరు” అని ఆయన అన్నారు. గత వారం గోవాలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. గత కొన్ని నెలలో, ప్రముఖ నాయకుడు గులాం నబీ ఆజాద్‌తో సహా చాలా మంది ప్రముఖ నాయకులు కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు, ఆయన ఇటీవల తన సొంత పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.

 

Exit mobile version