Kamal Movie Crazy Update: విశ్వ నటుడు కమల్ హాసన్ నటిస్తోన్న భారతీయుడు-2 సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.. 1996లో వచ్చిన ఇండియన్ సినిమాకు ఇది సీక్వెల్ గా రాబోతుంది. ఇందులో కమల్ హాసన్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ మూవీలో పంజాబ్ కు చెందిన నటుడు కనిపంచనున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రి యోగ్ రాజ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆయన మేకప్ వేసుకుంటున్న ఓ ఫోటోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
Read Also: Nivedha Thomas: నివేదా.. మళ్ళీ మురిపించేదెప్పుడమ్మా?
ఇటీవల చెన్నైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. యోగ్ రాజ్ తన ఇన్ స్టాలో చిత్రంలో నటీనటులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనకు మేకప్ వేసిన మేకప్ మెన్కు థ్యాంక్స్ చెప్పాడు. అలాగే కమల్ సైతం భారతీయుడు సినిమాలో నటించేందుకు పంజాబ్ సింహం సిద్ధంగా ఉందంటూ పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంవత్సరం సినిమా విడుదల అవుతుంది.