Kamal Haasan: ఆ సినిమా టికెట్ కోసం కొన్ని వారాల పాటు ఎదురు చూశా!
- కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్
- తొలి టికెట్‌ను కొన్న అమితాబ్
- అమితాబ్ నుంచి టికెట్‌ను తీసుకున్న కమల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamal Haasan recalls the first day of the movie Show Le: ‘షోలే’ సినిమా టికెట్ కోసం తాను కొన్ని వారాల పాటు ఎదురు చూడాల్సి వచ్చిందని లోకనాయకుడు కమల్‌హాసన్ తెలిపారు. అప్పట్లో షోలే సినిమాని చూసిన అభిమానులకంటే ఎక్కువగా.. ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ని చూస్తారన్నారు. బుధవారం ముంబైలో కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన కమల్‌హాసన్.. ఈ వ్యాఖ్యలు చేశారు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర నటించిన షోలే చిత్రం 1975 విడుదలై ఎన్నో రికార్డులు నెలకొల్పింది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 ఏడీ. ఇందులో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ లీడ్ రోల్స్‌లో నటించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ముంబైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో రానా హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ సినిమా తొలి టికెట్‌ను అమితాబ్‌కు అశ్వినీదత్ అందించగా.. బిగ్‌బీ నగదు చెల్లించి తీసుకున్నారు. ఈ టికెట్‌ను ఇవ్వాలనుకుంటే.. ఎవరికి ఇస్తారు? అని అమితాబ్‌ను రానా అడగ్గా.. కమల్‌హాసన్ పేరు చెప్పారు. అమితాబ్ నుంచి టికెట్‌ను తీసుకున్న కమల్.. షోలే సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
Also Read
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
- Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
- Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
Also Read: Deepika Padukone-Prabhas: బేబి బంప్‌పై దీపికా పదుకొణె ఫన్నీ కామెంట్స్!
‘ఇలా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్‌ని పొందే అవకాశం షోలే సినిమాకి వస్తే బాగుండేది. ఎందుకంటే కొన్ని వారాల పాటు ఆ సినిమా టికెట్ కోసం ఎదురు చూశా. అప్పట్లో ఆ సినిమాని చూసిన అభిమానులకంటే ఎక్కువగా ఇప్పుడు కల్కిని చూస్తారు. నా గురువు, మార్గదర్శి బాలచందర్ లాగా అసాధారణమైన మనుషులు చాలా సాధారణంగా ఉంటారు. అలాంటి వాళ్లతో మాట్లాడేవరకూ వాళ్లపై ఓ అభిప్రాయానికి రాను. సాధారణమైన వ్యక్తిలాగే ఉన్న నాగ్ అశ్విన్.. కథ చెప్పడంలో నేర్పుని చూసి ఆశ్చర్యపోయా. సినిమాను అంతే నేర్పుగా తెరపైకి తీసుకొచ్చాడు’ అని కమల్‌హాసన్ చెప్పారు.
తాజావార్తలు
-
Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
-
Telangana High Court : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై హైకోర్టు ఫైర్.. స్టే ఎత్తివేతకు నిరాకరణ.!
-
Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
-
Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
-
CP VC Sajjanar : బైక్‌పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్‌వేపై సడన్ చెక్.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!