లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల విక్రమ్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన ఆయన ఇప్పుడు తన తదుపరి చిత్రాలపై పూర్తి ఫోకస్ పెట్టారు.అయితే గతేడాది కమల్ హాసన్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.. దీంతో కమల్ తన తర్వాతి సినిమాలపై ఆసక్తి నెలకొంది.ప్రస్తుతం కమల్ హాసన్ లైనప్‌లో అన్నీ భారీ సినిమాలే ఉన్నాయి.అయితే, తాజాగా ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాలో తాను విలన్‌గా చేయాట్లేదంటూ పెద్ద బాంబ్ పేల్చిన కమల్ హాసన్ తన మిగతా సినిమాల గురించి తాజాగా ఓ మీడియా సంస్థకు వివరణ ఇచ్చారు.2024 సంవత్సరంలో మీ సినిమాల లైనప్ ఏంటీ అని అడిగిన ప్రశ్నకు ఇండియన్ (భారతీయుడు) ఫ్రాంచైజీలో రెండో భాగంతోపాటు మూడో పార్ట్ కూడా ఉంటుందని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు..ఈ వార్త విన్న ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
గత ఏడాది తాను సినిమాలు చేయకపోవడానికి గల కారణాలు కూడా కమల్ హాసన్ తెలిపారు. “నాకు సమయం వృథా చేయడం నచ్చదు. అలా అని ప్రొడక్షన్‌లో స్పీడ్ పెంచలేం కదా. మేము ఇండియన్ 2 మరియు ఇండియన్ 3 సినిమాలపై పని చేస్తున్నాం. ఇండియన్ 2, ఇండియన్ 3 చిత్రాల షూటింగ్ పూర్తి అయింది. ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టాం. దీని తర్వాత మిగతా సినిమాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది” అని కమల్ హాసన్ తెలిపారు.అలాగే కమల్ హాసన్ కల్కిలో తన పాత్ర గురించి తెలియజేశారు..నేను కల్కి 2898 ఏడీ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నాను. కాబట్టి నా పనులన్నింటిని త్వరగా పూర్తి చేసుకోవాలి” అని కమల్ హాసన్ పేర్కొన్నారు.దీనితో ప్రభాస్ కల్కి మూవీలో విలన్ ఎవరై వుంటారు అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.