NTV Telugu Site icon

Kamal Hassan: లంచానికి థ్యాంక్స్ చెప్పిన కమల్ హాసన్

Kamal

Kamal

Kamal Hassan: హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘భారతీయుడు-2’ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ లంచానికి థ్యాంక్స్ చెప్పారు. అది అందరికీ ఈజీగా అర్థం అయ్యే భాష అని.. అది ఉంది కాబట్టే 28 సంవత్సరాల తర్వాత కూడా అదే లంచం మీద సినిమా చేస్తున్నామన్నారు. డైరెక్టర్ శంకర్‌ ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్‌ సినిమాగా చేశారని కమల్‌ ప్రశంసలు కురిపించారు.

Read Also: Director Shankar: గేమ్‌ చేంజర్‌ రిలీజ్‌కి రెడీ.. కీలక అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్ శంకర్

ఇండియన్ 3 బాగుంది అంటే ఇండియన్ 2 బాలేదు అని అపార్థం చేసుకుంటున్నారని కమల్ అన్నారు. ఇండియన్ 2 అద్భుతంగా ఉంటుందనని.. కానీ తాను వ్యక్తిగతంగా ఇండియన్‌-3 కోసం ఎదురు చూస్తున్నానన్నారు. ‘ఇండియన్‌-2’నే ఇండియన్ 3 అని.. ఇండియన్‌-3యే ఇండియన్‌-2 అని కమల్ హాసన్‌ అన్నారు. ఈ సినిమా కొనుక్కోండి అని కమల్ పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు సిగ్గు లేదన్నారు. మంచి ప్రొడక్ట్ ఉంటే ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. అందులో తప్పేం లేదన్నారు. పళ్లమ్ముకునే వాళ్లే వాళ్లు దగ్గర ఉన్న పళ్ల గురించి చెప్పి అమ్ముకుంటారు.. మేము కూడా ఒక మంచి సినిమా చేశాం.. మా సినిమాను కొనుక్కోండి.. మా ప్రొడక్ట్ ను కొనుక్కోండి.. ఇలా చెప్పుకునేందుకు సిగ్గు లేదని కమల్ హాసన్‌ అన్నారు. ఎందుకంటే ఇది మా జాబ్ అంటూ కమల్ చెప్పుకొచ్చారు.

 

యూనివ‌ర్స‌ల్ స్టార్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘నేను చెప్పాల్సిన మాటలన్నీ నా వాయిస్‌లో బ్రహ్మానందం చెప్పేశారు. 52 ఏళ్ల క్రితం టెక్నీషియన్‌గా నా ప్రయాణం మొదలైంది. ఇన్నేళ్లుగా నాకు తోడుగా ఉన్న ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మూడు తరాలు నన్ను ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. భారతీయుడు రిలీజ్ అయినప్పుడు ఈ సీక్వెల్ గురించి ఆలోచించలేదు. భారతీయుడు భారీ హిట్ అయింది. డబ్బులు వస్తాయా? అని అందరూ అన్నారు. కానీ ఇప్పుడు ఒక షెడ్యూల్‌కి పెట్టే ఖర్చే చాలా ఎక్కువగా ఉంది.  శంకర్ గారి విజన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో తెలుగు సినిమాకు గొప్ప స్థానం ఉంది. నా జీవితంలో తెలుగుకి గొప్ప స్థానం ఉంది. మరో చరిత్ర, స్వాతిముత్యం, సాగర సంగమం వంటివి నా జీవితంలో వచ్చాయి. బాలచందర్, విశ్వనాథ్ వంటి వారు భాషాబేధాలను తుడిచిపారేశారు. ఇండియన్ 2 ఇప్పటి తరానికి రిలవెంట్‌గా ఉంటుంది. జనాల గురించే ఈ చిత్రం మాట్లాడుతుంది. ఇది ప్రజల సినిమా. 28 ఏళ్ల తరువాత మళ్లీ అదే దర్శకుడు, అదే పాత్ర నాకు రావడం అదృష్టం. ఇన్నేళ్లు నన్ను స్టార్‌గా నిలబెట్టారు. ఈ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను. ప్రతిభను పట్టుకొచ్చి అందరికీ పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. సినిమానే మీ అందరితో మాట్లాడుతుంది. ఈ మూవీ సెట్‌లో కమల్ హాసన్ ఎక్కడా కనిపించలేదని అన్నారు. నాలో సేనాపతి వచ్చాడు. అందుకే కమల్ హాసన్ ఎక్కడా కనిపించలేదు. ఇండియన్ 2 జూలై 12న రాబోతోంది. అందరూ చూడండి. నేను ఈ సినిమాలో నటించాను. ఈ మూవీకి నేను అభిమానిని. చిత్రాన్ని పెద్ద హిట్ చేయండి. మంచి క్వాలిటీతో సినిమాను తీశాం. అందరూ చూడండి. ఈ మూవీకి ఆరుగురు టాప్ స్టంట్ మాస్టర్స్ పని చేశారు. ఏసియన్ సురేష్, శ్రీలక్ష్మీ మూవీస్ మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.జూలై 12 కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.

Show comments