Site icon NTV Telugu

Kalyan Ram : ‘మెరుపు’లా దూసుకు వస్తానంటున్న కళ్యాణ్ రామ్ ?

New Project (2)

New Project (2)

Kalyan Ram : నంద‌మూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతనొక్కడే, బింబిసార వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, నిర్మాతగా కెరీర్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం త‌న కెరీర్ లో 21వ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాను ప్రదీప్ చిలుకూరి తెర‌కెక్కిస్తుండ‌గా, పూర్తి మాస్ యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ మూవీ రానుంది. ఇక ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ పాత్ర చాలా ప‌వ‌ర్ఫుల్ గా ఉండ‌బోతుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు.

Read Also:Parliament Session: నీట్‌పై కాంగ్రెస్ వాయిదా తీర్మానం.. లోక్‌సభలో గందరగోళం..

అయితే ఈ సినిమాకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ ని తీసుకున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ సంబంధించిన పూర్తి సమాచారం త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమాకి రామ్ చరణ్ టైటిల్ తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. అప్పట్లో రామ్ చరణ్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో అప్పట్లో మెరుపు అనే మూవీకి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. మెరుపు అనే టైటిల్ తో సినిమా అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కలేదు. అయితే అప్పటినుండి ఇప్పటివరకు మెరుపు సినిమా టైటిల్ ని ఎవరూ వాడుకోలేదు.

Read Also:Ayushman Yojana: వృద్ధులకు శుభవార్త.. 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ యోజన కింద చికిత్స

దీంతో ఈ చిత్రానికి ‘మెరుపు’ అనే టైటిల్ ను పెట్టేందుకు మేక‌ర్స్ ఆస‌క్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ అదే టైటిల్ తో వ‌స్తాడా లేదా వేరే టైటిల్ ఫిక్స్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి ఓ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్రలో న‌టిస్తున్నారు. అందాల భామ సాయీ మంజ్రేక‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ సినిమాకు అజ‌నీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Exit mobile version